తెలంగాణ ఆలయాలకు తిరుమల నిధులు.. ఎందుకు వివాదం అవుతోందంటే?
Publish Date:Jun 26, 2026
Advertisement
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక జీవో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టిటిడి బోర్డు, శ్రీవాణి ట్రస్ట్ తీర్మానాల ప్రకారం.. మొత్తం 6 పురాతన ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం నిధులను ఉపయోగించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడమే ఇందుకు కారణం. పురాతన ఆయయాల అభివృద్ధికి టీటీడీ నిధుల కేటాయింపునకు అనుమతి ఇస్తూ జారీ అయిన జీవో వివాదాస్పదం కావడానికి, పెను రాజకీయ చర్చకు దారి తీయడానికి కారణమేంటంటే.. ఈ ఆరు ఆలయాల్లో మూడు తెలంగాణలోని ఆలయాలు కావడమే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులను తెలంగాణలోని దేవాలయాలకు ఎలా కేటాయిస్తారంటూ, పెద్ద ఎత్తున విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్, వైసీసీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ.. ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వ్యవమరిస్తున్నాది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇ ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడ తమ పార్టీల బలోపేతం చేసుకోవడం కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని, తెలంగాణ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని తప్పుపడుతున్న వారూ.. విస్మరిస్తున్న కీలక అంశమేంటంటటే.. ట్రస్ట్ నిధులను తెలంగాణలో మూడు ఆలయాల అభివృద్ధికి వినియోగించడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందే కానీ, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా పొరుగురాష్ట్రానికి తరలించడంలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సొంత నిధులను తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి వినియోగించడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో. ఇక తిరుమలేశుడికి భక్తులు కానుకల ద్వారా సమర్పించుకున్న నిధుల వినియోగం విషయంలో కూడా ప్రాంతీయ బేధాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి, ప్రాంతీయ సరిహద్దులు, కుల, మతాల భేదాలు ఉండవు. తిరుమలేశునికి కానుకలు సమర్పించుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఉంటూ స్వామివారి హుండీకి కోట్ల రూపాయల కానుకలు సమర్పిస్తున్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల నుంచి అని కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. కానుకలు సమర్పించుకుంటారు. ఆ కానుకల ద్వారా వచ్చిన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం.. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో కూడా ఆలయాల నిర్మాణానికి, ఆధ్యాత్మిక ధర్మ ప్రచారానికీ వినియోగించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది పూర్తిగా ఒక ధార్మిక కార్యక్రమం, దీనికి రాజకీయాలను, ప్రాంతీయతలను ఆపాదించడం ఇసుమంతైనా సరికాదు. హిందూ ధర్మాన్ని రక్షణ, పురాతన ఆలయాల అభివృద్ధి విషయంలో టిటిడి, ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రాంతీయ కోణంలో చూడటం తగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/tirumala-funds-for-telangana-temples-45-224208.html




