వైసీపీలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డిల ఆధిపత్య పోరు!
Publish Date:Jul 1, 2026
Advertisement
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు జగన్‌తో డైరెక్ట్ రాపో ఉంది. వారిద్దరిలో ఎవర్నీ జగన్ కాదనలేరంటారు. వైపీపీ పవర్‌లో ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రాయలసీమ సీఎంలా చెలాయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అటు పెద్దిరెడ్డి, ఇటు చెవిరెడ్డి కేసులతో అల్లాడుతున్నారు. అది చాలదన్నట్లు ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మైదలైంది. పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ నేతల తీరు మారింది. ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డిని జగన్‌కు దూరం చేయడానికి చెవిరెడ్డి చక్రం తిప్పుతున్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలు అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చారు. మరి ఆ కేసుకు సంబంధించి వాటాల లెక్కల్లో తేడా వచ్చిందో? ఏమో కాని రామచంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారట. లిక్కర్ కేసు వ్యవహారంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్ వైఖరి మారిందంటున్నారు. సరిగ్గా అదే సమయంలో తాడేపల్లి లో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో చెవిరెడ్డి ఇస్తున్న సమాచారాన్ని జగన్ నమ్ముతున్నారని వైసీపీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని.. ఆ ఇద్దరు నేతలను సర్ది చెప్పలేక .. ఎవరి మాట వినరని పేరున్న జగన్ సైతం తెగ ఇదై పోతున్నారంట.
http://www.teluguone.com/news/content/power-struggle-between-peddireddy-and-chevireddy-45-224746.html





