గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా పొన్నూరు సంపెంగ పూల సువాసనలతో గుభాళిస్తున్నా ఆ వాసనను వాటిని పండించే రైతు ఆస్వాదించలేకపోతున్నాడు. పొన్నూరు మండలంలోని అనేక ప్రాంతాల్లో రైతులు సంపెంగ సాగు చేస్తున్నారు. వేసవిలో పైర గాలికి సంపెంగపూలు విరగకాసి కిలోమీటరు దూరం వరకు సువాసనలు వెదజల్లుతాయి. ఫిబ్రవరి నుంచి కాపు ప్రారంభమై మే వరకు పూస్తాయి. ఇక్కడి నుంచి సంపెంగ పూలు ప్రతిరోజూ గుంటూరు, విజయవాడ, బాపట్ల, చీరాల తదితర ప్రాంతాలకు వెళుతుంటాయి. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ వీరాంజనేయస్వామి వార్లకు భక్తులు సంపెంగ పూలతో నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే ఈ సంపెంగ తోటల అభివృద్ధికి ప్రభుత్వం ఉద్యానశాఖ అధికారుల ప్రోత్సాహం కరువైంది. దీంతో తోటలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. పూర్తిగా తోటల పెంపకంపైనే తాము జీవనం సాగించలేమని రైతులు అంటున్నారు. సీజన్ లో ఒక్కో చెట్టుకు 100 పూలు మాత్రమే పూస్తాయని, వీటిని అమ్ముకోగా వచ్చే డబ్బులు తోటలకు ఆకుతడి పెట్టడానికి కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntur-24-12401.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.