పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు చెందిన 'గ్రీన్ ఆశా' అనే భారీ ఎల్పీజీ నౌక సురక్షితంగా హెర్మూజ్ జలసంధి దాడి ఇండియా చేరుకుంది. ప్రపంచ దేశాల ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన, ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిన హోర్ముజ్ జలసంధిని ఈ నౌక విజయవంతంగా దాటుకుని రావడం విశేషం.
సుమారు 15,400 టన్నుల వంటగ్యాస్ తో ఈ నౌక ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వద్ద లంగరు వేసింది. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణా చేయడం అత్యంత క్లిష్టంగా మారిన సంగతి విదితమే. ఈ క్రమంలో భారత పతాకంతో ఉన్న గ్రీన్ ఆశా నౌక, హెర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి భారత్ చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న తొలి భారతీయ ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం.
ఈ నౌక ప్రయాణం ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య, ప్రమాదాల మధ్యా సాగింది. హోర్ముజ్ జలసంధిలో నియంత్రణను కఠినతరం చేసిన ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారత్ ఈ రవాణాను సుసాధ్యం చేసింది. నౌకలోని సిబ్బంది అందరూ భారతీయులేనని స్పష్టం చేస్తూ.. ప్రత్యేక సంకేతాల ద్వారా ఇరాన్ అధికారుల సమన్వయంతో గ్రీన్ ఆశా తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ నౌకలో ఉన్న ఇంధనం దేశంలోని గృహావసరాలకు ఎంతో కీలకం అనడంతో సందేహం లేదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామం మరింత ఉతమిస్తుందనడంలో సందేహం లేదు. భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది.
గ్రీన్ ఆశాతో కలిపి ఇప్పటివరకు మొత్తం తొమ్మిది ఇండియా షిప్పులు హెర్మూజ్ జలసంధి గుండా ప్రయాణం సాగించాయి. ఇండియన్ నేవీకి చెందిన యుద్ధనౌకలు కూడా ఈ నౌకల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి.రాబోయే రోజుల్లో మరిన్ని నౌకలు ఇదే మార్గంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడే వరకు రవాణా రంగంలో ఇలాంటి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా, అంతర్జాతీయ ఒత్తిళ్ల నడుమ తమ ఇంధన అవసరాల కోసం భారత్ చూపుతున్న దౌత్యపరమైన చొరవ విజయవంతమవుతోందని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/green-asha-successfully-crosses-hormuz-and-reaches-india-36-217011.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.