మూసీ ప్రాజెక్టు తొలి దశకు ఏడు వేల కోట్ల రూపాయలు!

Publish Date:May 9, 2026

Advertisement

భాగ్యనగరానికి మణిహారంగా నిలిచే మూసీ నది పునరుద్ధరణ,  సుందరీకరణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి దశ పనులను ఏడువేల 55  కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి   మొదటి విడత పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా గడువును నిర్దేశించుకుంది.

 మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం (మే 8) జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో  మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు. మొదటి దశ నిధుల కోసం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు కమిటీకి వివరించారు.

ఈ ఏడాది ఆగస్టు నుంచే క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగని విధంగా మొదటి 5 కిలోమీటర్ల మేర (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపు ఘాట్ వరకు) పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కేవలం నది ప్రక్షాళన మాత్రమే కాదనీ.. నగర వాసుల జీవన ప్రమాణాలను పెంచే సామాజిక బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు.  

ప్రాజెక్టులో భాగంగా నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. అలాగే..  నదిలో నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించడానికి,  పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అత్యాధునిక  రబ్బర్ డ్యామ్ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. నాసిక్, ముంబై నగరాల్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని మంత్రులు చెప్పారు. ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం ద్వారా వీలైనంత వరకు ప్రస్తుత కట్టడాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. భూసేకరణ మరియు పునరావాస ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  అలాగే..  ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హోర్డింగ్‌లు, ప్రచార చిత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

By
en-us Political News

  
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.