నిమజ్జనం బందోబస్తులో రచ్చ: మహిళా ఎస్‌ఐపై యువకుడు అసభ్య ప్రవర్తన.!

Publish Date:Sep 27, 2026

Advertisement

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించిన మహిళా ఎస్‌ఐకి ఓ వ్యక్తి నుంచి అనూహ్యమైన స్పందన ఎదురైంది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడంతో ఆ మహిళ ఎస్సై అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌ 23న అర్ధరాత్రి దాటిన తర్వాత అల్మాస్‌గూడ కమాన్‌ వద్ద శ్లోకా స్కూల్‌ సమీపంలో ఆక్సిజన్ ఫిట్నెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనం వేడుక జరుగుతుండగా కొందరు వ్యక్తులు మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా మహిళా ఎస్‌ఐ గుర్తించారు. 

వెంటనే ఆమె రాత్రి సమయం కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొద్దిసేపు అంటూ  ముందుకు వచ్చి మహిళా ఎస్‌ఐతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమె విధులు నిర్వహించకుండా అడ్డు కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అతడిని ఆక్సిజన్‌ ఫిట్‌నెస్‌ క్లబ్‌ యజమాని సాకేత్‌ కుమార్‌గా గుర్తించినట్లు ఆమె తెలిపారు. మహిళా ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  మీర్‌పేట్‌ పోలీసులు సాకేత్‌ కుమార్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 74, 75(2), 132 కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

 

[ Ganesh immersion, Meerpet Police Station, Saket Kumar, Almasguda Kaman, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderbad police, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.