పేలుళ్ల హెచ్చరికలతో ఉలిక్కిపడిన భాగ్యనగరం: అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు ముమ్మరం.!

Publish Date:Nov 26, 2026

Advertisement

హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భాగ్యనగరంలో  26/11 తరహాలో  దాడులకు పాల్పడనున్నట్లుగా లష్కరే తోయిబా పేరుతో వచ్చిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్  అయ్యారు.   నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి..  కీలక ప్రాంతాల్లో ముమ్మర  తనిఖీలు చేపట్టారు. 

ఈ నెల‌ 18న జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు ఉంటాయని నవంబర్ 21న పంపిన ఈమెయిల్‌లో అగంతకులు పేర్కొన్నారు.   కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగేలా దాడులకు పాల్పడనున్నట్లు ఆ మెయిల్ లో పేర్కొన్నారు. 

ఈ హెచ్చరికల నేపథ్యంలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. మెయిల్‌లో పేర్కొన్న ప్రదేశాలతో పాటు ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాంటీ-సాబోటేజ్ తనిఖీలు నిర్వహించారు. 

అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్ లో పేలుళ్లు: బెదరింపు ఈ మెయిల్ తో పోలీసులు అలర్ట్.!​

డిస్పోజబుల్ ఈమెయిల్ అడ్రస్, విదేశీ వీపీఎన్ సర్వర్ ఉపయోగించి ఈ మెయిల్ పంపినట్లు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది ఎవరో ఆకతాయిల పని అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అయినా కూడా  భద్రతాపరంగా ఎలాంటి అలసత్వం కూడదన్న భావనతో అప్రమత్తంగా ఉన్న పోలీసులు,    ప్రశాంతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు.  ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న గమనించిన  112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

మీకు నచ్చవచ్చు:   లుఫ్తాన్సా ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

పేలుళ్ళకు వాడిన బాంబులు ఇక్కడ చేసినవె

[Terror, Attacks, Threat, Emain, Laskareetoiba, Hyderabad, Kachiguda, TeluguOne]

By
en-us Political News

  
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.