వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నిధుల కొరత?

Publish Date:May 21, 2012

Advertisement

ప్రస్తుత ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొత్త సమస్య ఎదురైంది. 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిథుల కొరతను ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల కార్యకర్తలకు కూడా రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. దీనికి ప్రధానకారణం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం నుంచి వీరికి నిథులు అందకపోవడమే. మీరు రాజీనామాలు చేయండి నేను మిమ్మల్ని గెలిపించుకుంటానన్న భరోసాను జగన్ వీరందరికీ ఇచ్చారు.

 

 

అయితే హఠాత్తుగా జగన్ ఆస్తులపై అటు సిబీఐ, ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లు దృష్టిపెట్టాయి. పార్టీ న్యూస్ పేపర్, టీవీ ఛానల్ అకౌంట్ తో పాటు జననీ ఇన్ ఫరా అకౌంట్ ను కూడా సిబీఐ స్తంభింపజేసింది. దర్యాప్తు సంస్థల చర్యలతో భయపడిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థులకు నిథులు పంపలేకపోతున్నారు. దీంతో అభ్యర్థులు నిథుల లేమితో విలవిలలాడుతున్నారు. తమ దగ్గర ఉన్న వనరులతో పోలింగ్ వరకూ క్యాడర్ ను మెయింటైన్ చేయటం, ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టడం కష్టమని వారు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఖర్చు విషయంలో తాము ఇతర పార్టీ అభ్యర్థుల కన్నా వెనుకబడిపోతామని దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని వారు భయపడుతున్నారు.

By
en-us Political News

  
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడి
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు.
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.