ఎన్నికల తర్వాతే జగన్ అరెస్టు?

Publish Date:May 21, 2012

Advertisement

అక్రమాస్తుల కేసులో ప్రధాననిందుతుడైన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అరెస్టుపై ఇంకా సందిగ్ధత కొనసాగురూనే ఉండి. నేడో రేపో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఉప ఎన్నికల తరువాత ఆయనను అరెస్టు చేయించాలన్న భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందు జగన్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని రాష్ట్రప్రభుత్వం భయపడుతోంది. దీనికి తోడు పోలింగ్ కు ముందు అరెస్టు చేస్తే ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి పెరిగే ప్రమాదముందని, ఇదే జరిగి అన్ని నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నట్లు తెలిసింది.

 

 

 

జగన్ అరెస్టు, ప్రజా సానుభూతి కారణంగా అన్ని స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోని మరికొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు జగన్ పంచన చేరే ప్రమాదముందని, ఇదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయమని కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాల అనంతరమే జగన్ ను అరెస్టు చేస్తే మంచిదన్న భావనతో ఆయన ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 2, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ ను బలహీనపరిచి ఎన్నికల అనంతరం అతన్ని అరెస్టు చేస్తే ఇక ఎటువంటి సమస్యలు ఉండవన్నది కిరణ్ కుమార్ వ్యూహంగా కనిపిస్తున్నది. జగన్ అరెస్టుకు ముందుగానే అతని ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టడం ద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వం జగన్ ను బలహీనపరిచింది.

By
en-us Political News

  
తెలంగాణ శాసనసభలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది.
నేపాల్‌లో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది ఆ వరదల్లో గల్లంతయ్యారు.
హైదరాబాద్ నగరంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన మీరాలం చెరువు సరికొత్త పర్యాటక కాంతులతో మెరిసిపోయేందుకు సిద్ధమవుతోంది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) జయరాజు ఇళ్లు, ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడి
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు.
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.