హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్: 40 మందికి అస్వస్థత.!

Publish Date:Nov 20, 2026

Advertisement

హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీ  పరిధిలోని  రెండు హాస్టళ్లలో ఫుడ్ పాయిజినింగ్ అయ్యింది. మొత్తం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  హెచ్సీయూ పరిధిలోని ఎంఅనెక్స్, ఎన్ఆర్ఎస్ బాయస్ హాస్టళ్లలో భోజనం చేసిన తరువాత దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన వర్సిటీ ఆరోగ్య కేంద్రం, సమీపంలోని ప్రైవేటు హాస్పటల్స్ కు తరలించి చికిత్స అందించారు.  ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. 

ఈ ఘటనకు సంబంధించి అస్వస్థతకు గురైన విద్యార్థుల సమాచారం మేరకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం   అస్వస్థతకు గురయ్యారు.  ఉదయం టిఫిన్‌లో పోహా తిన్న తర్వాత కొంతమందికి, మధ్యాహ్న భోజనంలో వేయించిన కూరగాయలు తిన్న తర్వాత మరికొందరికి వాంతులయ్యాయి.  రాత్రి భోజనంలో రాజ్మా రైస్ తిన్న తర్వాత పలువురు ఇదే రీతిలో అస్వస్థతకు గురయ్యారు. 

చికిత్స అనంతరం అందరి ఆరోగ్యం కుదుటపడింది.    రాత్రి భోజనం చేసిన తర్వాత రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనీ, సహాయం కోసం వర్సిటీ అధికారులకు పదేపదే ఫోన్ చేసినా  స్పందన రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1 గంటకు డిప్యూటీ చీఫ్ వార్డెన్ వచ్చి పరిస్థితిని పరిశీలించారని, అనంతరం తెల్లవారుజామున 2:45 గంటలకు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించారని వివరించారు. 

 ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైనా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  హాస్టళ్లలో ఆహార నాణ్యత, అత్యవసర వైద్య సదుపాయాల నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   అలాగే, ఫుడ్ పాయిజన్‌తో బాధపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పరీక్షల షెడ్యూల్‌లో సడలింపు ఇవ్వాలని  కోరారు. 

ఇది కూడా చదవండి:  సాంబారులో చచ్చిన బల్లి: 40 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.!​

వసతి గృహాల్లో భోజన ఏర్పాట్ల పర్యవేక్షణపై మరింత శ్రద్ధ అవసరమనే అభిప్రాయం విద్యార్థి వర్గాల్లో వ్యక్తమవుతోంది.   రాబోయే రోజుల్లో హాస్టళ్లలో ఆహార తనిఖీలు, వైద్య అత్యవసర ఏర్పాట్లపై వర్సిటీ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

 విద్యార్థి సంఘం డిమాండ్ల మేరకు పరీక్షల షెడ్యూల్‌లో సడలింపులపై అధికారులు నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానిపై విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.   బాధిత విద్యార్థులంతా పూర్తిగా కోలుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని క్యాంపస్ వర్గాలు కోరుతున్నాయి. హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య భద్రతపై వర్సిటీ తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి నిలిచి ఉంది.  

మీకు నచ్చవచ్చు:  తెలంగాణలో ఆహార సంస్థలపై TG SAFE ప్రత్యేక తనిఖీలు..!​

ఫుడ్ పాయిజనింగ్, రావడానికి అసలు కారణం ఇదే.. అన్నం నిల్వ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!​

[Food poisoning,  HCU falHostels,  40pupils, Healthstable, TeluguOne]

By
en-us Political News

  
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య కలకలం రేపింది.
అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. 
విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్‌.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.