విమలక్కకు పిఓడబ్య్లు సంధ్య వార్నింగ్
Publish Date:Apr 23, 2012
Advertisement
ఒకరేమో మహిళా హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, మరోకరేమో ప్రత్యేక తెలంగాణా సాధన ఉద్యమ సంఘం నాయకురాలు. ఏకత్రాటిపై నడవాల్సిన వీరిద్దరూ ఇప్పుడు పరస్పరం ద్వేషించు కుంటున్నారు. ఓపెన్ గానే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలా రచ్చకెక్కినవారిలో ఒకరు పిఓడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య కాగా, మరొకరు తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క. వీరిద్దరూ ప్రత్యేక తెలంగాణాకోసం అనేక వేదికలపై కలిసి మాట్లాడారు. అయితే ఎప్పుడూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నించేవారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా రంగరాయ చెరువు ప్రాజెక్టు విషయమై ఈ ఇద్దరు నాయకురాళ్ళ మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సంధ్య కోరుతుంటే రద్దు చేయాల్సిన అవసరం ఏముందని విమలక్క అంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే పేదప్రజలకు అనుకూలంగా తాము ఉద్యమిస్తుంటే విమలక్క వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని సంధ్య ఆరోపిస్తున్నారు. అరుణోదయ కళాకారిణిగా, తెలంగాణా ఉద్యమ నాయకురాలిగా విమలక్కను గౌరవిస్తామని, అలా కాకుండా నిర్వాసిత ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే టఫ్ అయినా ఉఫ్ అయినా లెక్కచేయబోమని సంధ్య అంటున్నారు. అయితే నిర్వాసితుల పట్ల తమకు కూడా ప్రేమ ఉందని కాని ప్రాజెక్టు వల్ల జరిగే ప్రయోజనాలను కూడా గమనించాలని విమలక్క అంటున్నారు. వీరిద్దరి మధ్యా వివాదం తెలంగాణా వాదుల్ని కలవర పెడుతోంది.
http://www.teluguone.com/news/content/differences-between-pow-president-sandhya-and-tuf-leader-vimalakka-24-13549.html





