ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. బుధవారం ( మే6) ఉప్పల్ వేదికగా పంజాబ్ కిగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సునాయాస విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
తరువాత 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ జట్టులో యువ ఆటగాడు కూపర్ కానెల్లీ కేవలం 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజేయంగా నిలిచి చేసిన ఒంటరి పోరాటం నిష్ప్రయోజనం అయ్యింది. ఇతర బ్యాటర్లు సన్ రైజర్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.
హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. పంజాబ్ ఫీల్డింగ్ లోపాలు కూడా హైదరాబాద్ భారీ స్కోరు సాధించడానికి ఒక కారణంగా మారాయి. సమన్వయ లోపంతో పంజాబ్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలను హైదరాబాద్ బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
ప్రస్తుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలు నమోదు చేసి, మొత్తం 14 పాయింట్లతో టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది. అంతకుముందు అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunrisers-hyderabad-out-play-punjab-kings-36-219101.html
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.