ఊరందరిది ఒకదారి సిపిఎంది మరోదారి !

Publish Date:May 30, 2012

Advertisement

ఊరందరిది ఒకదారి ఉలిపిరికట్టది మరోదారి అన్నచందంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ జగన్ అవినీతిని దుమ్మెత్తి పోస్తుంటే సిపిఎంమాత్రం జగన్ అరెస్టులో రాజకీయ కోణం ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఎప్పుడూ అవినీతి గురించి వంటికాలిపై దూసుకు వచ్చే సిపిఎం జగన్ అక్రమ ఆస్తులు, అవినీతి విషయంలో మెతక వైఖరి అవలంభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ అరెస్టుతో రాజకీయ కారణాలు సంగతి ఎలా వున్నప్పటికీ జగన్ అవినీతిని సిపిఎం వెనకేసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు వున్నట్టు కనిపిస్తోంది.



2009 ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయినా సిపిఎం పార్టీ  2014లో  పూర్తిగా పుంజుకోవాలనే  ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగాను రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలసి ప్రయాణం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జగన్ తో లోపాయకారిగా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో నిన్న సాక్షి అకౌంట్లు నిలిపివేత  సందర్భంగా  పత్రికా స్వేచ్ఛకు భంగం అంటూ సిపిఎం వ్యాఖ్యానాలు చేసింది. నేడు జగన్ అరెస్టు సందర్భంగా కూడా అరెస్టులో రాజకీయ కోణం వుందంటూ ఆ పార్టీ కార్యదర్శి బి.వి.రాఘవులు వ్యాఖ్యానించడాన్ని బట్టి భవిష్యత్తులో జగన్ తో కలసి ప్రయాణించడం ఖాయమనిపిస్తోంది.  గెలుపు ఓటముల సంగతి ఎలావున్నప్పటికీ ఇప్పటి వరకు రాజకీయ నిబద్ధత కలిగిన పార్టీగా గుర్తింపు పొందిన సిపిఎం తాజా ఎత్తుగడలు, నిర్ణయాలతో ఇతర బూర్జువాపార్టీలకు ఏ మాత్రం తీసిపోదనే భావన కలిగిస్తోంది.

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.