ఉత్సాహాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆరోపణలు

Publish Date:May 16, 2012

Advertisement

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి, పిసిసి నేత బొత్స సత్యనారాయణ, చిరంజీవి ముగ్గురూ కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని, అవినీతికి చిరునామా జగన్ అంటూ ముఖ్యమంత్రి విమర్శలతో విరుచుకుపడటం ప్రజలలో ఆలోచన కలిగిస్తోంది.

 

 

 

నిన్నమొన్నటి వరకూ జగన్ పై ఎటువంటి విమర్శ చేయని, లక్ష చదరపు అడుగుల్లో ఇళ్ళు ... 75 పడకగదులతో ఇళ్ళు కట్టుకున్న జగన్ పదవికోసం వెంపర్లాడుతున్నాడంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో నేరుగా జగన్ పై విరుచుకుపడటం, నేతలు ముగ్గురూ కలిసి ప్రచారం చేయడం ఓటర్లలో మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిననాటి నుండి జగన్ ను పల్లెత్తు మాట కూడా అనని కిరణ్ నేడు తీవ్రమైన స్థాయిలో జగన్ పై ఆరోపణలు చేయకపోతే తన రాజకీయమనుగడ వుండదని ఆయన గుర్తించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

జగన్ కు కిరణ్ అత్యంత సన్నిహితుడని, నిజానికి కిరణ్ ప్రభుత్వం  వైఎస్ జగన్ కు కోవర్టుగా పనిచేస్తోందన్న ఆరోపణలు నిజమనే భావన ప్రజలలో కలగడమే కాకుండా చివరకు అధిస్థానం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కు పదవీగందం తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో పదవిని కాపాడుకోవాలంటే ఉప ఎన్నికల్లో జయాపజయాల సంతతి ఎలా వున్నప్పటికీ కనీసం తాను జగన్ కు కోవర్టును కాననే విషయాన్ని అయినా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి కిరణ్ కు ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఆయన జగన్ పై విమర్శలు సంధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు జగన్ కోవర్టుగా భావించిన కిరణ్ కూడా స్వయంగా జగన్ అవినీతిని, విలాసవంతమైన భవనాల గురించి ప్రస్తావించడం ఆ ప్రభావం ఎంతోకొంత ఓటర్లపై చూపిస్తుందని భావించినట్టుగానే ఓటర్లలో మార్పు కనిపిస్తున్నట్టుగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.