రాజ్యసభకు షర్మిల.. కాంగ్రెస్ బంపరాఫర్

Publish Date:Jun 1, 2026

Advertisement

దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ..  ఇటీవల తమిళనాడులో టివికెతో పొత్తు పెట్టుకుంది. కేరళలో సైతం అద్భుతమైన రీతిలో అధికార పీఠాన్ని దక్కించుకుని సరికొత్త జోష్‌తో దూసుకుపోతోంది. ఈ విజయాల పరంపరతో లభించిన  ఉత్సాహంతో, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ అగ్రనాయకత్వం ఒక భారీ నజరానా ప్రకటించింది.
ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు వైఎస్ షర్మిల రాజ్యసభ నామినేషన్‌ను అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం. కర్ణాటక నుంచి  కాంగ్రెస్ ప్రతినిధిగా ఆమెను రాజ్యసభకు పంపేందుకు సర్వం సిద్ధమైంది. వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇది అత్యంత కీలకమైన మలుపుగా,  ఒక పెద్ద ప్రమోషన్‌గా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ పదవి ఆమెకు ఎప్పుడో దక్కాల్సి ఉందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే..  ఇచ్చిన హామీని  కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు  గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్యసభలో పార్లమెంటు కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూనే,  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ఆమెకు ఒక పెద్ద పరీక్ష కానుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత కాపాడుకుంటూ ఎలా ముందుకు సాగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శల పదును పెంచుతూ, పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్నారు.   తన సొంత అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి, రాజకీయంగా సొంత మార్గాన్ని ఎంచుకున్న షర్మిల, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో ఆమె స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయినప్పటికీ, ఏపీలో ఆమె నాయకత్వానికి గుర్తింపు లభించింది.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందించిన ఈ రాజ్యసభ సభ్యత్వం  వైఎస్ షర్మిల రాజకీయ ఆకాంక్షలకు,  భవిష్యత్తు ప్రణాళికలకు ఊతం ఇస్తుందని అంటున్నారు. ఈ కీలకమైన పదవి సాధించిన తర్వాత, ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నడిపిస్తారో మరియు అది రాబోయే రోజుల్లో పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.