జగన్ కు సవాల్ విసిరిన చిరంజీవి

Publish Date:May 21, 2012

Advertisement

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్ జగన్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయాయని నిరూపిస్తే తాను ప్రజల్లోకి రావడం మానేస్తానని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏం అన్యాయం చేసిందని కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని ఆయన అడిగారు. సిబిఐ దర్యాప్తులో జగన్ అక్రమాలు ఒక్కొటొక్కటే బయపడుతున్నాయని ఆయన అన్నారు. జగన్ క్రిమినల్స్‌కు అందడందలు అందిస్తున్నారని ఆయన అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పేవారికి ఒటు వేయవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన కోరారు. అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువ నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీని హస్తం గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ యువనేతకు గుణపాఠం చెప్పాలని ఆయన జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

By
en-us Political News

  
అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు.
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
డిమాండ్ల సాధన కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.  ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  
గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్..!
సరూర్‌నగర్ స్టేడియంలో క్రికెట్ కోచ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగుతోంది.
ప్రియురాలికి కిడ్నాప్ మెసేజ్ పంపడంతో బట్టబయలైన వ్యవహారం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.