వాడిగా వేడిగా కిరణ్ ప్రసంగాలు ... ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ ... టి.ఆర్.ఎస్. ...
Publish Date:May 21, 2012
Advertisement
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మాటలకు పదనుపెట్టి ఘాటైన పదజాలంతో ఒకవైపు జగన్ నూ, మరోవైపు టి.ఆర్.ఎస్. నూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రత్యేకించి జగన్ తో టి.ఆర్.ఎస్.కు ఉన్న సంబంధాలను ప్రస్తావించకుండా ఆయన ప్రసగ్నాన్ని ముగించటం లేదు. ఇంతవరకూ ప్రత్యేక తెలంగాణాకు తాను వ్యతిరేకం కాదన్న సిఎం ఉప ఎన్నికల సందర్భంగా (ఎన్నికలు జరిగే 18 స్థాన్నాల్లో 17 అసంబ్లీ స్థానాలు సీమాంధ్రలోనివే) రాష్ట్ర విభజనపై కర్ర విరగాకూడదు ... పామూ చావకూడదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉదంతాలను ఉదాహరిస్తూ సిఎం తాను చేసే ప్రసంగం ఆసక్తికరంగా సాగేందుకూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వై.ఎస్.లానే ఈయన కూడా చేతులు ఊపుతూ ఆవేశపూరితమైన పదాలను ఉచ్చరిస్తున్నారు. ఓ సందర్భంలో వై.ఎస్.తాను తెలంగాణాకు అడ్డమూ. నిలువూ కాదని సంచలనమైన వ్యాఖ్య చేశారు. అదే విధంగా సిఎం మాటల్లో ... "తన తండ్రి వ్యతిరేకించిన తెలుగుదేశం, మతతత్వపార్టీగా ముద్ర వేయించుకున్న బిజెపిలతో జతకట్టిన జగన్ ఏమి చేసేందుకైనా వెనుకాడదు. ఆ రెండు పార్టీలే వై.ఎస్.కు సిద్ధాంతపరంగా బద్ధశత్రువులన్న విషయాన్ని జగన్ మరిచాడు. అందుకే నన్ను దించాలని ఆ రెండు పార్టీలను సహాయం అర్థించాడు. ఇంకా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు చూస్తున్న టి.ఆర్.ఎస్.తో జతకట్టాడు. అందుకే గత ఎన్నికల్లో తెలంగాణా లో పోటీకి ఎవరినీ నిలబెట్టలేదు. అసలు ఈ సంబంధం సక్రమమేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. జగన్ కు ఏమైనా నీతి ఉందా అని ప్రశ్నిస్తున్నాను. టి.ఆర్.ఎస్.కు మద్దతు ఇచ్చిన జగన్ సమైక్యవాడా అని నేను అడుగుతున్నాను. మీరే చెప్పండి! అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన జాగర్ రాష్ట్రాన్ని పాలిస్తారా? లేక ఇంకా దోచేస్తారా? ఏమైనా తన అధికారం కోసం ఎన్నికల నిబంధనలన్నీ పాతరేస్తాడు. రోడ్డుషోలో మందు బాటిల్స్ పంచుతూ పోయిన జగన్ నీతి గురించి ఇంకోసారి చెప్పే పనే లేదు. ఇక పచ్చి అవకాశవాదం ఉన్న టి.ఆర్.ఎస్. గురించి చెప్పాల్సిన పనిలేదు'' ఇలా ఘాటెక్కిన పదాలతో పాటు సిఎం ముఖం కూడా సీరియస్ గా ఉండటంతో ఈ ప్రసంగం వింటున్న వారు అలానే నిలిచిపోతున్నారు. గతంలో చూసిన సిఎం కిరణ్ ఇతనేనా? అనిపించేలా ఈ ప్రసంగాలున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా సిఎం ప్రసంగాల ఘాటుకు సమాధానం చెప్పేందుకు పార్టీలు కూడా తడబడుతున్నాయి. వరుస ఉదాహరణలతో ఆయన ప్రసంగం ఓ ధారలా సాగిపోతోందని పలువురు కాంగ్రెస్ నేతలూ ప్రశంసిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/powerful-punch-dialogues-by-cm-kiran-kumar-reddy-24-14185.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





