సి.బి.ఐ. లక్ష్మీ నారాయణకు సెలబ్రటీ హోదా !

Publish Date:Jun 4, 2012

Advertisement

సిబిఐలో షాడో టీమ్ ఉందా? జెడి లక్ష్మీ నారాయణే దీన్ని ఏర్పాటు చేశారా? దీని విధివిధానాలు ఏమిటీ? వంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సిబిఐ జడ్జి పట్టాభిరామారావుపై చేసిన ఇన్ వెష్టిగేషనే సమాధానమిస్తోంది. నేరనియంత్రణ విభాగంలో సిబిఐకు దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నతస్థానాన్ని జెడి నిలబెట్టారని ఆయనను పలువురు కొనియాడుతున్నారు.

గతనెల 23న  మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణ, 24న నిమ్మగడ్డ ప్రసాద్ పై విచారణ, 27న జగన్ అరెస్టు వంటి సంచలన వ్యవహారాల్లో తల మునకలవుతూనే జెడి లక్ష్మినారాయణ తన షాడో టీమ్ కు పని కల్పించారు. ఆ టీమ్ కర్నాటక మంత్రి గాలిజనార్దనరెడ్డి బెయిల్ స్కాంను బయటపెట్టింది. దాని పూర్తి ఆధారాలు సేకరించటంలో షాడో టీమ్ విజయం సాధించినా హైకోర్టు ప్రధానన్యామమూర్తి ముందు పూర్తి ఆధారాలు చూపి అనుమతి పొందాకనే జెడి మీడియా ముందుకు వచ్చి బెయిల్ స్కాం ఉదంతాన్ని వెల్లడించారు. ఒకవైపు సిబిఐకు అనుమతి ఇస్తూనే మరోవైపు పట్టాభిరామారావుని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు పంపించింది.

ఈ సంచలన కేసులో షాడో టీమ్ ఎలా పనిచేసిందో ఒక్కసారిగా గమనించాలి. జెడి తన పనిలో తానుండగా షాడో టీమ్ కర్ణాటకలోనూ, ఆంధ్రాలోనూ ఆధారాలు సేకరించింది. దీనికి కారణం కూడా జగన్ అక్రమాస్తుల కేసులో ఉచ్చు బిగుస్తున్న ఈ తరుణంలో గాలికి బెయిల్ ఎలా ఇచ్చారని కొందరు న్యాయనిపుణులు జెడి లక్ష్మినారాయణను ప్రశ్నించటంతో ఈ బెయిల్ స్కాం వెలుగులోకి వచ్చింది. నిందితులు కూడా నెట్ వర్క్ చేసుకుని తన కార్యక్రమాలు పరిశీలిస్తారని అనుకున్న జెడి దర్యాప్తు జరుగుతున్నంత కాలం దిల్ కుషాలోని  సిబిఐ కార్యాలయానికి, ఇంటికి మాత్రమే వెడుతూ షాడో బృందానికి సూచనలిచ్చారు. ఈ బృంద సభ్యులు జెడి ఇచ్చిన వివరాల ప్రకారం ఆధారాలు సేకరిస్తూ కార్యాలయ పనిగంటలు ముగిశాక తమ పని నివేదికలు తెలియజేసింది. హైకోర్టు జడ్జిని కలిసిన తరువాతే ఈ స్కాం వివరాలను జెడి బయటపెట్టారు.

సిబిఐకు ఉన్న రహస్య విభాగాన్నే షాడో టీమ్ అంటారు. ఈ టీమ్ లో ఎవరు ఎప్పుడు ఎక్కడ దర్యాప్తు చేస్తారో ఉన్నతాధికారి అయిన జెడికి తప్ప మిగిలిన వారికి తెలియదు. సాక్షాత్తు జడ్జి అవినీతినే బహిర్గతం చేసిన ఈ టీమ్ తొలి ప్రయత్నమే విజయవంతం కావటంతో ప్రభుత్వం ఇటువంటి ఆపరేషన్లకు ప్రోత్సాహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్ విధానాన్ని చూసిన వారందరూ మాత్రం హ్యాట్సాఫ్ జెడి అని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన త్వరలో సెలబ్రటీ హోదా పొందినా ఆశ్చర్యపోనక్కరలేదు.
 

By
en-us Political News

  
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.