బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్.!

Publish Date:Sep 7, 2026

Advertisement

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ను పోలీసులు మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం అరెస్టు చేశారు.  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.  హైదరాబాద్‌లోని నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో  ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. తాతా మధుతో పాటు ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.  తాతా మధు అరెస్టును బీఆర్ఎస్ ఖండించింది.  రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ఈ అరెస్టులు దారణమని పేర్కొంది.  ఇలా ఉండగా అసెంబ్లీ మర్యాదను కాపాడేందుకే తాతామధును అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

అదలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 7) అసెంబ్లీ గేట్ల వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరిగిన తోపులాట సందర్భంగా తాతా మధు  స్పీకర్‌ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి   అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్‌ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతామధు వాడిన భాష   శాసనసభ గౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానమని  పేర్కొన్నారు. కాగా తాతా మధును శాసనమండలి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.  

అయితే..  తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు.  తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని  ఆరోపించారు. ఒకవేళ తన వ్యాఖ్యలు స్పీకర్‌ను కించపరిచినట్లు భావిస్తే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ వాటిని వెనక్కి తీసుకుంటున్నానన్నారు.  

 

[BRS MLC Tata Madhusudhan arrest, Hyderabad police, Telangana assembly speaker, BRS leaders detention, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.