మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఎందుకంటే?

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో  ఒక్క సారిగా హీట్ పెరిగింది. అసెంబ్లీ వర్షాకాల సమవేశాల ప్రారంభం రోజున అంటే సోమవారం (సెప్టెబర్ 7) శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలు,  సభలో జరిగిన పరిణామాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు,  అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి  తన కేబినెట్ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని పీఎం  ఛాంబర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో  అసెంబ్లీలో జరిగిన గందరగోళం, ఆందోళనల సమయంలో స్పీకర్‌ను, పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన పూర్తి వివరాలతో కూడిన వీడియో ఫుటేజ్‌లను సీఎం రేవంత్ రెడ్డి  ఈ సందర్భంగా  పరిశీలించారు. అలాగే ఈ ఘటనలకు   సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.   

స్పీకర్ పదవిలో ఉన్న ఒక దళిత నేత పట్ల అత్యంత అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధుపై   కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ, దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  డిమాండ్ చేశారు. సీఎం తో జరిగిన ఈ అత్యవసర సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన దళిత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీరుపై  మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ దళితుల పట్ల చిన్నచూపు ఉందని, దళిత వర్గానికి చెందిన  స్పీకర్‌ను అవమానించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

దళిత స్పీకర్‌ను కించపరిచిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే చట్టపరమైన కేసులు నమోదు చేసి, సభ నుంచి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది. 

[Revanth emergency Meeting With Ministers, MLAs, MLCs, Telangana Assembly, Tata Madhu, BRS MLC, Speaker controversy, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.