లుఫ్తాన్సా ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

Publish Date:May 15, 2026

Advertisement

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ భద్రతా అలర్ట్ చోటుచేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి శంషాబాద్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌వేస్  విమానంలో బాంబు ఉందంటూ బెదరింపు రావడంతో విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ విమానం శంషాబాద్ చేరుకునేలోపు పేల్చివేస్తామని తెలియజేస్తూ కస్టమర్ సపోర్ట్‌కు వచ్చిన బెదిరింపు ఈమెయిల్ తో   భద్రతా యంత్రాంగం   అలర్ట్‌ అయ్యింది.

వెంటనే కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే  దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

అనంతరం  బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విమానాన్ని అణువణువుగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సామాన్లు, కార్గో విభాగం, కేబిన్ ప్రాంతం సహా ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా సాంకేతిక పరికరాలతో పరిశీలించారు. అలాగే ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.  ఈ ఘటనతో ఇతర విమానాల రాకపోకలలో జాప్యం జరిగింది.  బెదిరింపు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు పంపారు అన్న విషయాన్ని గుర్తించేందుకు   దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.  

By
en-us Political News

  
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.