Publish Date:May 15, 2026
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇల్లంతా బంగారమే. మంచాల దగ్గర నుంచి ఆ ఇంట్లో ప్రతి ఫర్నీచర్ బంగారంతో తయారైందే. శిబ్పూర్ టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే నివాసంలో ఓ కేసు నిమిత్తం సోదాలు నిర్వహించిన పోలీసులకు బంగారంతో తయారు చేసిన ఫర్నీచర్ తో ఆ ఇల్లు మెరిసిపోవడం చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. కాగా సోదాలు జరిగిన సమయంలో షమీమ్ అహ్మద్ కుటుంబం పరారీలో ఉంది.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో అరెస్టు భయంతో షమీమ్ అహ్మద్ కుటుంబం పరారీలో ఉంది.
ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన నివాసాంలో సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో ఆయన ఇంట్లో బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు.. ఆయన నివాసంలోని మెట్లదారి రహస్య తలుపును తెరిచిన పోలీసులకు కిలోల కొద్దీ బంగారం కనిపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tmc-leader-shamim-ahmmad-house-fullgold-36-219833.html
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది