Publish Date:Jan 17, 2013
కమలానంద అరెస్ట్ ను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు రాత్రి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమలానంద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా పోలీసులు అరెస్ట్ చేశారని వారు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ ని కలిసేందుకు వెళ్ళిన హిందూ మత పెద్దలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి స్వామీజీలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకి దిగారు. కమలానంద భారతిని విడుదల చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు.
రాత్రి నుండి ఆందోళన చేస్తున్న స్వామిజీలకు భారతీయ జనతా పార్టీ నేతలు, విశ్వహిందూ పరిషత్ నేతలు మద్దతు పలికారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి "కమలానంద మాట్లాడుతుండగా తాను అక్కడే ఉన్నానని, ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు". ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. స్వామిజీలకు మద్దతుగా భారీగా బిజెపి, విహెచ్‌పి కార్యకర్తలు తరలి వస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-protests-kamalananda-swamys-arrest-43-20431.html
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్ ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానికి వివరించారు.
ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.
న్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం ఆ పార్టీకి ఇదే తొలిసారి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు