విజయవాడ మేయర్ ఎన్నికలో ఘోర పరాజయం: ఏబీవీ పొలిటికల్ ఎంట్రీపై నీలినీడలు.!

Publish Date:Nov 4, 2026

Advertisement

విజయవాడ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్,  వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు నిరాశే మిగిలింది.  ఎన్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి  దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఫలితం ఆయన రాజకీయ ప్రవేశంపై నీలి నీడలు కమ్ముకునేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక  తెలుగుదేశం కూటమి తరఫున జనసేన  అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధా విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన ఏకంగా 2,65,888 ఓట్లు సాధించి, 1,30,872 ఓట్ల భారీ   మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైసీపీ  మేయర్ అభ్యర్థి  భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి.  విశేషం ఏమిటంటే.. వంగవీటి రాధా  మెజారిటీ  రెండవ స్థానంలో నిలిచిన వైకాపా అభ్యర్థి భాగ్యలక్ష్మి సాధించిన మొత్తం ఓట్లకు దాదాపు సమానంగా  ఉండటం గమనార్హం.

ఇక  ఏబీవీ   12 వేల 642 ఓట్లతో సరిపెట్టుకుని మూడో స్థానానికి పరిమితమయ్యారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన ఏబీవీకి నిజాయతీ పరుడు, విధినిర్వహణలో రాజీ లేకుండా పని చేస్తారు అన్న గుర్తింపు ఉన్నప్పటికీ ఆ గుర్తింపు ఈ ఎన్నికలో  కనీసం గౌరవప్రదమైన ఓట్లను సాధించడానికి కూడా పనికి రాకుండా పోయింది.   

[AB Venkateswara Rao Political Entry in Doldrums, Vijayawada Mayor Election Defeat, Third Place, Former IPS Officer, AP Politics, Telugu One] 

By
en-us Political News

  
ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై  లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.  ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.  
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం  ఆ పార్టీకి ఇదే  తొలిసారి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా.. తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Narsipatnam Municipality, Chinthakayala Padmavathi, AP Municipal Elections, NDA Alliance Victory, Ayyannapatrudu, AP municipal elections, YSRCP, Telugu News, Telugu One
పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు సాధించిన   విజయాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  మంత్రి ఎస్.సవిత మంగళవారం మీడియాతో  మాట్లాడారు.
క్లీన్ స్వీప్ చేసిన పసుపు పార్టీ.!
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.