ఈవీఎంలే కాదు బ్యాలెట్ కూడా: ఓటమిపై జగన్ స్పందన.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజనులు.!

Publish Date:Nov 4, 2026

Advertisement

ఏపీ మునిసిపోల్స్ ఫలితాలు జగన్ కు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. 2024 ఎన్నికలలో ఓటమి నాటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో ఏదో జరిగింది. ఏవీఎంల కారణంగానే ఓడిపోయాను కానీ జనం నావెంటే ఉన్నారని చెప్పుకున్న జగన్, ఈ ఓటమికి కూడా దాదాపు అదే కారణం చెప్పారు. అయితే తేడా ఏంటంటే ఏపీ మునిసిపోల్స్ బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి.

దీంతో ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.  2024 ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయానికి  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలే కారణమని, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగితే ప్రజలు తమను భారీ సంఖ్యలో గెలిపిస్తారంటూ జగన్ అప్పట్లో జగన్ పదే పదే చెప్పారు తాజాగా ఎలాంటి ఈవీఎంల ప్రమేయం లేకుండా పూర్తిగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగిన పురపోరులోనూ జనం వైసీపీకి పరాజయాన్నే అందించారు.  

  2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 151 స్థానాల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయిన తర్వాత, మీడియా ముందుకు వచ్చిన జగన్ ఈవీఎంల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరిగిందని, ఈవీఎంలలో ఏదో మతలబు ఉందని ఆరోపిస్తూ, అయితే ఏం చేస్తాం నా వద్ద ఆధారాలు లేవంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.  బ్యాలెట్ విధానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రజలు తమ వెంటే ఉన్నారంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.  

అయితే ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన మునిసిపోల్స్ లో కూడా జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మున్సిపల్ ఎన్నికలన్నీ పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి. ఎక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు తావులేకుండా ఓటర్లు నేరుగా బ్యాలెట్ పేపర్లపై తమ అభ్యర్థులకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే జగన్ ఎప్పుడైతే ట్యాంపరింగ్ లేని పద్ధతిగా భావించారో, అదే బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరగడం విశేషం. ఎలాంటి ట్యాంపరింగ్ ఆస్కారం లేని ఈ ఎన్నికల్లో ప్రజలు అత్యంత స్పష్టమైన తీర్పును వెలువరించారు. దీంతో జనం ఎటువైపు ఉన్నారన్నది తేటతెల్లమైంది. 

ఓ పక్క మునిసిపోల్స్ ఫలితాలు వెలువడుతుండగానే.. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు గుప్పిస్తూ, జగన్  బ్యాలెట్ విధానంపై  వ్యాఖ్యలు, అప్పటి వీడియోలను నెటిజనులు నెట్టింట తెగ వైరల్ చేశారు.  ఈవీఎంల వల్లనే ఓడిపోయామని గతంలో వాదించిన నేత, ఇప్పుడు బ్యాలెట్ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చవిచూడటంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.  అయితే వాటిని వేటినీ పట్టించుకోని జగన్ ఈ ఎన్నికలను సెలక్షన్స్ గా అభివర్ణిస్తూ.. టీమ్ చంద్రబాబుకు కంగ్రాట్స్ అంటూ ఎన్నికల సంఘం, పోలీసులను ట్యాగ్ చేశారు. ఆత్మ విమర్శకు బదులు పర నిందతో తనను తాను జగన్ మభ్య పెట్టుకోవడమే కాకుండా, ప్రజలనూ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.  


 [Jagan EVM Allegations And Ballot Eections, Local Body Elections,  Andhra Pradesh, YCP defeat, TeluguOne]

By
en-us Political News

  
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై  లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.  ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.  
న్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి  దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం  ఆ పార్టీకి ఇదే  తొలిసారి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా.. తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Narsipatnam Municipality, Chinthakayala Padmavathi, AP Municipal Elections, NDA Alliance Victory, Ayyannapatrudu, AP municipal elections, YSRCP, Telugu News, Telugu One
పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు సాధించిన   విజయాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  మంత్రి ఎస్.సవిత మంగళవారం మీడియాతో  మాట్లాడారు.
క్లీన్ స్వీప్ చేసిన పసుపు పార్టీ.!
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
మొత్తం 87 మున్సిపాలిటీలలో ఎన్డీయే కూటమి ఏకంగా 63 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది.   తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 45 మున్సిపాలిటీలను గెలుచుకోగా, జనసేన   15 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరోవైపు, వైసీపీ   5 మున్సిపాలిటీలకే పరిమితమై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇతరులు   3 స్థానాలను దక్కించుకున్నారు.
తుఫాన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నందికొట్కూరులో బైరెడ్డి మార్క్ రాజకీయం.. వ్యూహం సక్సెస్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.