బీఫ్ ఫెస్టివల్ లక్ష్యం నెరవేరిందా?

Publish Date:Apr 21, 2012

Advertisement

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పెద్దకూర పండగ (బీఫ్ ఫెస్టివల్) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా ఉద్యమం కంటే ఎక్కువగా దీని గురించి చర్చించుకొంటున్నారు. తెలంగాణా ఉద్యమం కోసం కలిసి కట్టుగా ఉద్యమించిన ఉస్మానియా విద్యార్ధులే ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్నారు. కత్తులతో దాడులు చేసుకొని ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు. చిలికిచిలికి గాలివాన అయినట్టుగా ఈ ఆహర అంశం చుట్టూ రాజకీయాలతోపాటు మత విద్వేషాలు చేరి నెమ్మదిగా పెద్ద సామాజిక సమస్యగా మరే పరిస్థితి కనిపిస్తోంది. అది పెద్దకురా అయినా.. చిన్న కురా అయినా ఆహారాన్ని ఆహారంగా కాకుండా మతం, కులం కోణంతో చూడటం వల్ల మానవత్వం మరింత కలుషితం అవుతుంది.

 

 

ఒకప్పుడు దళితులు గొడ్డు మాంసం ప్రధాన ఆహారమని ఉస్మానియా హాస్టల్లో కూడా తమకు గొడ్డు మాంసం వడ్డించాలని ఇటీవల కొంత మంది దళిత విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్ కు డెమెక్రాటిక్ కల్చర్ ఫోరంతో పాటు సిమాంధ్రులను దోపిడీ దారులుగానూ, దొంగలగానూ చిత్రీకరించి, తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చ గోట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర రావు, గాలి వినోద్ కుమార్, నాగసూరి వేణుగోపాల్, మీనా కందస్వామి, డి. ప్రభాకర్ వంటి వారు మద్దుతు పలికారు. అంతేకాగ బీఫ్ ఫెస్టివల్లో వీరు కూడా పాల్గొన్నారు. ఇటువంటి ఫెస్టివల్ ను నిర్వహిస్తే అడ్డుకుంటామని ఎ.బి.వి.పి విద్యార్దులు ముందే హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ గోశాల సమాఖ్య సభ్యులు ఎ ఫెస్టివల్ నిర్వాహకులపై ముందుగానే పోలీసులకు పిర్యాదు చేశారు. గొడ్డు మాంసం తెచ్చి అంబేద్కర్ హాస్టల్ వద్ద వండుకుంటామని దళిత విద్యార్థులు చెబితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. అయితే బయట వండుకుని లోనికి తెచ్చుకుని తింటే తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. దీనికి కూడా ఉస్మానియా యూనివర్సిటి అధికారులు అంగీకరించలేదు. కాని దళిత విద్యార్థులు బయట నుంచి బీఫ్ తో చేసిన బిర్యాని అంబేద్కర్ హాస్టల్ ఆవరణంలో కి తెచ్చి తింటుండగా ఎ.బి.వి.పి విద్యార్దులు అడ్డుకోవడానికి ప్రయత్ని౦చారు. అనంతరం రెండు వర్గాల మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది.  జీవహింసను వ్యతిరేకించే బౌద్ధ మతంలో చేరిన అంబేద్కర్ పేరిట ఉన్న హాస్టల్ వద్ద కత్తిపోట్లు కూడా చోటుచేసుకున్నాయి. రక్తం కూడా పారింది. అప్పటి దాక దళిత విద్యార్థులకు మద్దతు ప్రకటించిన మేధావి వర్గం అంతా అక్కడ నుంచి పరారైపోయింది. వీరించిన సలహాలు, ప్రోత్సాహంతో విందు జరుపుకున్న విద్యార్థులకు పోలీసు కేసులు మిగిలాయి.



ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు హాస్టల్ లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవచ్చా? లేదా? అన్న వాదోపవాదాలు ప్రారంభం కావడం మరో ఎత్తు. ఎవరి ఆహార అలవాట్లు వారివి. మనది లౌకిక, ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఏ మతాన్ని అయినా అవలభించవచ్చు. ఎవరి సంప్రదాయాలను, అలవాట్లను కొనసాగించుకోవచ్చు. ఎవరి అలవాట్లు వారివి, అటువంటప్పుడు పెదకూర పండుగ అంటూ ప్రత్యేకంగా బీఫ్ తినడాన్ని పండుగగా చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నను కొందరు ముందుకు తీసుకువస్తున్నారు. అగ్రకులాలకు చెందినవారు తినే ఆహారమే ఉన్నతమైనది. ఇతరులు తినే ఆహారం నీచమైనదా? కులతత్వంతో కునారిల్లుతున్న భారతదేశంలో కొన్ని కులాలవారు నీచులని, అంటరానివారనే భావన వుంది. అంటరాని కులాలకు చెందిన వ్యక్తులు ఆహారపు అలవాట్లు కూడా నీచామనే ధోరణి చాలామందిలో వుంది. కులం కారణంగా ఎవరూ నీచులు కారని, అదే విధంగా కింది కులాలు తినే ఆహారం నీచం కాదనే తెలియచెప్పడం కోసమే పెద్దకూర వంటి పండుగలు అనివార్యమావుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంది నీచ జంతువూ అయినా శూద్రులలో అగ్రకులాలుగా వున్న అనేకమంది దీని మాంసం తింటారు. అగ్రకులంవారు తింటారు కాబట్టి ఆ మాంసం నీచం కాదు. గొడ్డు మాంసం కేవలం కింది కులాలకు చెందినవారు మాత్రమే తింటారు కాబట్టి అది నీచంగా ప్రచారం చేశారు.



గొడ్డుకూర పండుగలో పాల్గొనడం, దానిని తినడం వల్ల మీరు సాధించింది ఏమిటని హిందుత్వధోరణులతో వున్న విద్యార్థులు కొందరు మేధావులు, విద్యావంతులను ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ పండుగ చేయడం ద్వారా దళితులు తమ సైద్దాంతిక హక్కును చాటుకొనే ప్రయత్నం చేశారన్న వాదన వినిపిస్తోంది.



ఎద్దు మాంసం వండినా, వివిధ వర్గాల వారు ఉండే హాస్టళ్ళలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినా ఆవును పూజించేవారు ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో పెద్దకూర పండుగ చేసుకొంటున్నారనే అంశాన్ని మరికొంతమంది ముందుకు తీసుకువస్తున్నారు. పెద్దకూర పండుగ చేస్తున్నప్పుడు పందిమాంసం పండుగ ఎందుకు చేయకూడదు? అంటూ మతతత్వసంస్థలు నిర్వహించే విద్యార్థి సంఘాలు ఎద్దేవా చేస్తున్నాయి. పందిమాంసం పండుగ చేస్తే పందిమాంసాన్ని ముట్టుకోవడమే పాపంగా భావించే మతానికి చెందినవారు సహించరని, వారిని ఎదిరించే సత్తా వీరికి లేదని పరోక్షంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.



విద్యా సంస్థల్లో వివిధ వర్గాల వారు ఉంటారు. కొందరు గొడ్డుమాంసం కావాలంటున్నారు. యానాదులు వంటివారు ఎలక మాంసాన్ని, మరి కొందరు రకరకాల పిట్ట మాంసాలతో పాటు పావురాయి మాంసాన్ని, ఇంకొందరు పిల్లి మాంసాన్ని కావాలని డిమాండ్ చేస్తే వాటిని కూడా వడ్డించడం సాధ్యం అవుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో శాఖాహారం ఉన్నతమైనదని, మాంసాహారం నీచామైనదనే ప్రచారం కూడా జరుతుతోంది. నిజానికి ప్రపంచ జనాభాలో 95 శాతం మంది మాంసాహారులే. అమెరికా, యూరోపియన్ దేశాల్లో గొడ్డు, పందిమాంసం ప్రధానమైన ఆహారం. భారతదేశంలో కూడా 90 శాతం మంది మాంసాహారులే. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో పూజారి వర్గానికి చెందిన వారు కూడా మాంసాహారం భుజిస్తారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులను బట్టి ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి. ఎవరిళ్ళలో ఎవరికీ ఇష్టమైన ఆహారం వారు తీసుకుంటే ఏ గొడవా ఉండదు. యూనివర్సిటీల్లోని సామూహిక భోజనశాలల్లో ఎక్కువమంది ఇష్టపడే ఆహారం వద్దించక తప్పదు. మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో గొడ్డుమాంసం తినేవారు తక్కువ శాతం ఉన్నారన్నది నిర్వివాదాంశం. వీరి కోసం సామూహిక భోజనశాలల్లో గొడ్డుమాంసం వడ్డిస్తే, వీరిలాగే ఇతర రకాల మాంసాలను ఇష్టపడే వారి కోర్కె కూడా తీర్చాల్సి వస్తుంది. ఏదో ఒక వర్గం సైద్ధాంతిక హక్కు చాటుకోవడం కోసం ఫలానా మాంసం కావాలని కోరుకుంటే ఇతర వర్గాలు కూడా అలాంటి హక్కునే చాటుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ మరో అంశం కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ హక్కు చాటుకోవాలనే భావన వారికే వచ్చిందా లేక వారికెవరైనా సూరిపోశారా? ఈ హక్కులను అడ్డుకున్న వర్గం వెనుక ఎవరున్నారన్న విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.