తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు.. వివాదం ఎక్కడంటే?

Publish Date:Mar 23, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ , లోక్ స‌భ స్థానాలు పెరగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, అలాగే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263 స్థానాలకు పెరిగే అవకాశాలున్నాయి. అంటే తెలంగాణలో 60, ఏఫీలో 88 అసెంబ్లీ సీట్లు అదనంగా పెరుగుతాయి.  దేశ వ్యాప్తంగా 273 లోక్ సభ స్థానాలు పెరగనున్నాయి.   1971 నాటి జ‌నాభా లెక్క‌ల ఆధారంగా..  ప్ర‌స్తుతం నియోజ‌వ‌ర్గాలు ఉన్నాయి.

  అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు జ‌నాభా భారీగా పెరిగింది. దీంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియో జ‌క‌వ‌ర్గం  ఎంత చిన్న‌గా  ఉంటే..  ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రిం చ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.  

ఇక ఈ విషయంలో ఒకింత వివాదం కూడా నెలకొని ఉంది. కొన్ని రాష్ట్రాల్లో జ‌నాభా నియంత్ర‌ణ‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసినందుల నియోజకవర్గాల పెంపుదలలో ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇక ఎంపీ స్థానాలు ఎక్క‌డ ఎక్కువ పెరుగాయి? అన్న‌ది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాది  ఎంపీల  సంఖ్య ఎంత‌? వ‌చ్చే రోజుల్లో పెర‌గ‌నున్న సంఖ్య ఎంత‌? ఓవ‌రాల్ గా  ఉత్త‌ర- ద‌క్షిణ భార‌తాల్లో ఎక్కువ మంది  ఎంపీలు ఎక్క‌డి నుంచి ఉన్నారు? అని ప‌రిశీలిస్తే.. పాండిచ్చేరితో క‌లిపి ద‌క్షిణాదిలో ప్ర‌స్తుతానికి 131 పార్ల‌మెంటు స్థానాలున్నాయి. 

రాష్ట్రాల వారీగా ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో పెర‌గ‌నున్న స్థానాలు ఎన్నో చూస్తే.. ఏపీ 25 నుంచి 38కి, తెలంగాణ 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ద‌క్షిణాది లో 190 నుంచి 200 స్థానాల వ‌  పెర‌గొచ్చు. దేశంలోనే అత్య‌ధిక ఎంపీల‌ను ఇస్తున్న రాష్ట్రాలు ఉత్త‌ర్ ప్ర‌దేశ్, బిహార్.   ఇదిలా ఉంటే రేప‌టి రోజున 800కి పైగా పెర‌గ‌నున్న దేశ వ్యాప్త ఎంపీల సంఖ్య‌లో మ‌న  ద‌క్షిణాది వారు క‌నీసం 200 మంది కూడా లేక పోవ‌డ‌మూ ఒక ర‌క‌మైన చ‌ర్చ‌నీయాంశ‌మే. ఇక్క‌డి నుంచి ఎక్కువ జీఎస్టీ  వ‌సూళ్లు చేసి.. ఉత్త‌రాది  రాష్ట్రాల్లో ఆ మొత్తం ఖ‌ర్చు చేయ‌డం అన్న‌ది  ఇప్పుడే కాదు ఎప్ప‌టి  నుంచో న‌లుగుతున్న స‌మ‌స్యే. దీన్ని స‌మ‌తుల్యం చేయ‌డం ఎలా అన్న‌ది వివాదాస్పదంగా మారింది. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న ఆందోళన ఆయా రాష్ట్రాల నుంచి గట్టిగా వ్యక్తం అవుతోంది.
 
ఇక ఒక్క‌సారిగా సీట్లు పెరిగితే పార్ల‌మెంటు, అసెంబ్లీ భ‌వ‌నాల్లో.. సీట్లు ఇత‌ర స‌దుపాయాల‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. ఇది వేరే స‌మ‌స్య‌. అంతే కాదు ఆయా పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అధికారుల నియామ‌కం కూడా ఒక సవాలే.

అదలా ఉంటే..  2026 జ‌నాభా లెక్క‌ల త‌ర్వాత‌.. మ‌న ఎమ్మెల్యేల సంఖ్య‌తో పాటు ఎంపీల సంఖ్య కూడా పెరుగుతుంది  కాబ‌ట్టి కొత్త నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఇలా పెరగనున్న స్థానాల విషయంలో రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. 

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
బడి పిల్లలను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.