ఏపీలో కొత్తగా మరో నాలుగు పోలీస్ కమిషనరేట్ లు: జీవో జారి చేసిన ప్రభుత్వం.!

Publish Date:Oct 6, 2026

Advertisement

పోలీస్ శాఖలో  మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ట్రాఫిక్, నేరాలు, వీఐపీ భద్రత, శాంతిభద్రతల నిర్వహణ మరింత మెరుగుపరి చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

కొత్త కమిషనరేట్లకు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరించనున్నారు. వీరికి  బీఎన్ఎస్ఎస్   2023లోని సెక్షన్ 14(6) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించింది.. దీంతో పోలీస్  అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్  నిర్వహణలో నిర్ణయాలు తీసుకునే అధికారం  కేంద్రీకృతమవుతుంది.

భక్తుల రద్దీ, ట్రాఫిక్, నేరాల నియంత్రణ, వీఐపీల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ   టెరిటోరియల్ జోన్లు ఉంటాయి. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీసిటీ, పుత్తూరు, నాయుడుపేట సబ్‌డివిజన్లు కూడా  ఈ కమిషనరేట్ పరిధిలోకే వస్తాయి.  

తిరుపతి కమిషనర్ పోస్టు కోసం విజయవాడ సిటీ క్రైమ్స్ జాయింట్ సీపీ పోస్టును పునర్వ్యవస్థీకరించారు. అలాగే మెరైన్ వింగ్ ఎస్పీ పోస్టును డీసీపీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పోస్టును డీసీపీ (శ్రీకాళహస్తి), విజయవాడ ట్రాఫిక్ డీసీపీ పోస్టును డీసీపీ (తిరుపతి), గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ పోస్టును డీసీపీ (శ్రీసిటీ)గా మార్చారు. 

ఇక గుంటూరు కమిషనరేట్‌కు కూడా ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. దీని పరిధిలో గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి   జోన్లను ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తుళ్లూరు, మంగళగిరి తదితర ప్రాంతాలు కూడా ఈ  పరిధిలోకి వస్తాయి. కమిషనరేట్‌కు ఐదుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలను కేటాయించారు.

రాజమహేంద్రవరం కమిషనరేట్‌కు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉంటారు. దీని కింద నలుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు పనిచేయనున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, కొవ్వూరు సబ్‌డివిజన్లు ఈ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి.

కర్నూలు కమిషనరేట్ పరిధిలో కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌డివిజన్లు ఉంటాయి. రాష్ట్రంలోని ఇతర కొత్త కమిషనరేట్ల మాదిరిగానే దీనికి కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నేతృత్వం వహించనున్నారు. 

కాగా ఈ నాలుగు కమిషనరేట్ల ఏర్పాటు చేసినప్పటికీ,  అదనపు పోస్టులను మంజూరు చేయకుండా, ఇప్పటికే ఉన్న పోలీస్ శాఖ పోస్టులను పునర్వ్యవస్థీకరించి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అవసరమైన చోట డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీల పోస్టులను ప్రస్తుతం ఉన్న క్యాడర్ నుంచి మార్చారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు పోలీస్ కమిషనరేట్ వ్యవస్థ అమల్లో ఉంది. తాజాగా మరో నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుతో ఈ వ్యవస్థ పరిధి రాష్ట్రంలోని మరిన్ని ప్రధాన పట్టణ, అభివృద్ధి ప్రాంతాలకు విస్తరించింది.

మొత్తంగా చూస్తే, నాలుగు కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ద్వారా పోలీస్ శాఖలో కమాండ్, కంట్రోల్, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం, ఉద్యేశంగా కనిపిస్తోంది.   ముఖ్యంగా తిరుపతిలో భక్తుల రద్దీ, గుంటూరు, అమరావతి ప్రాంతంలో వేగంగా  జరుగుతున్న అర్బనైజేషన్, రాజమహేంద్రవరం, కర్నూలు ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణకు కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

[AP Police Commissionerates, Andhra Pradesh Police, Tirupati Commissionerate, Guntur Commissionerate, Kurnool Commissionerate, Rajamahendravaram Commissionerate, AP Police, Police Commissionerates, Chandrababu Government,Telugu One]

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.