తుపాను తీరం దాటింది: అయినా ఏపీని వదలని వాన గండం.. ఏడు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం.!

Publish Date:Sep 24, 2026

Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా ఏపీకి వర్షాల ముప్పు ఇంకా తప్పలేదు.   ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతోంది. అంతే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి.  ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏపీలోని ఏడు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 

ఉత్తరాంధ్ర జిల్లాలు, వాటిని  ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో  సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలలో మరో 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

ఈ జిల్లాల్లో  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.  ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల నుంచి ప్రవహించే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

కాజ్‌వేలు దాటే సాహసం   చేయవద్దని, ప్రయాణాల సమయంలో  అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను నివారించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రోడ్లు దెబ్బతినడం, రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే  ప్రజలు   అత్యవసరమైతే తప్ప  ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.  

[AP Flash Floods, Andhra Pradesh Rains, IMD Weather Warning, 7 Districts Flood Alert, Heavy Rains, AP News, Telugu One]

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.