అది హిందూపురం కాదు.... కబ్జాల పురం
అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా హిందూపురంలో కబ్జాల పర్వం కొనసాగుతుంది. ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురవుతున్నాయి. మున్సిపల్ ఆస్తులను కాపాడాల్సిన కౌన్సిల్ సభ్యులు, వారి బంధువులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు స్మశానాలను కూడా వదలడం లేదు. నీటి చెరువులు, మురుగు కాల్వలు, కాలవగట్లు ఇలా ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే అక్కడ దానిని కబ్జా చేస్తున్నారు. ఈ అక్రమణలకు అడ్డుకట్టు వేయాల్సిన అధికారులు మామూళ్ళకు లొంగి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ పరిధిలోకి పొట్నూరు చెరువు, సూరప్ప కుంట చెరువు, శ్రీకంఠపురం చెరువుల అక్రమణలపై లోకాయుక్త స్పందించేవరకు స్థానిక అధికారులలో చలనం లేకుండా పోయిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలాజీ టాకీస్ రోడ్డులోని అంబేద్కర్ నగర్ కు చెందిన స్మశానవాటికను కొందరు వ్యక్తులు ఆక్రమించిఏకంగా దుకాణ సముదాయాన్ని నిర్మించారు. ధనలక్ష్మీరోడ్డు, కంసాలిపేట, మెయిన్ రోడ్డు, బెంగుళూరురోడ్డులలో నిర్మించిన ట్యాంకులు, ఆక్రమణదారుల పరమయ్యాయి. పట్టణంలో మెజారిటీ ఆక్రమణలు అమ్మకాల కోసమో, బాడుగల కోసమో జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండుకాదు వేలసంఖ్యలో ఖాళీ స్థలాలు దురాక్రమణకు గురయ్యాయి. దీనిపై అటు మున్సిపల్ అధికారులుగానీ, ఇటు రెవెన్యూ అధికారులుగాని పట్టించుకోవడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anathapuram-district-24-12302.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.