హైదరాబాద్: విద్యుత్ బిల్లుల పెంపు షాక్ నుంచి వినియోగదారులు తేరుకోక ముందే ట్రాన్స్ కో మరో షాకిచ్చింది. అదనపు బిల్లుల పేరుతో వేలాది రూపాయలు వడ్డిస్తోంది. ఈ అదనపు ఛార్జీలను నెలలోపు చెల్లించాల్సిందే అంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. విలాస వస్తువులను ఉపయోగిస్తూ విద్యుత్ వాడకాన్ని ఎక్కువగా చేస్తుండటంవల్ల ఈ అదనపు బిల్లు కట్టాల్సిందే అంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సామాన్యులు కూడా కూలర్, ఫ్రిజ్, రైస్ కుక్కర్, ఐరన్ బాక్స్ తదితర ఎలక్ట్రికల్ వస్తువులు కొంటున్నారు. ఇంట్లోకి వెళ్లి చూసి, ఆ వస్తువులు ఇంట్లో కనబడితే చాలు వాడినా వాడకపోయినా అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. వినియోగదారులు దరఖాస్తు సమయంలో ఎన్ని యూనిట్లు విద్యుత్ వాడతామో ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ కెపాసిటికి మించి విద్యుత్ ను వినియోగించడం వల్ల కొరతలు ఏర్పడుతున్నాయని, ఈ విద్యుత్ కోరతలను తగ్గించేందుకే ఇటువంటి ఛార్జీలను వసూలు చేస్తున్నామని ట్రాన్స్ కో అధికారులు అంటున్నారు. విలాస వస్తువుల వల్ల విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/again-24-12301.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.