అమరావతి ఒఆర్ఆర్: నాలుగు ప్యాకేజీలుగా నిర్మాణం.. 13 వేల 92 కోట్ల అంచనా వ్యయం.!

Publish Date:Oct 5, 2026

Advertisement

అమరావతికి మహర్ధశ పట్టే దిశగా రవాణా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని చుట్టూ  ఆరు వరుసల ఔటర్‌ రింగ్‌ రోడ్డు  నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్  భారీ అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. 189.93 కీలోమీటర్ల పొడవున నిర్మితం కానున్న ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అంచనా వ్యయం 13 వేల కోట్ల 91 లక్షల 75 వేల రూపాయలు. ఈ ప్రాజెక్టును డీబీవోటీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానాల ద్వార నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులను సత్వరం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ టెండర్ల దాఖలు చేయడానికి వచ్చే నెల 18 తుది గడువుగా నిర్ణయించారు. అనంతరం టెండర్లను ఆ మరుసటి రోజు అంటే నవంబర్19న తెరవనున్నారు. 

ఇక నాలుగు ప్యాకేజీల వివరాలను పరిశీలిస్తే.. మొదటి ప్యాకేజీ కింద కంచికచర్ల నుంచి మైలవరం వరకు మరీ స్పష్టంగా చెప్పాలంటే.. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద జీరో కిలోమీటర్ల నుంచి  27వ కి.మీ. వరకు  నిర్మిస్తారు. కొండపల్లి, పంగిడి అటవీ ప్రాంతాల గుండా సాగే ఈ మార్గంలో 2.68 కి.మీ.,  1.64 కి.మీ. చొప్పున రెండు భారీ సొరంగాలు ఉంటాయి.  ఇక రెండో ప్యాకేజీ కింద 27వ కి.మీ. నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను వరకూ అంటే 83వ కిలోమీటర్ వరకు హైవేను విస్తరిస్తారు. రాజధాని పరిధిలో వేగవంతమైన రవాణాకు ఈ మార్గం కీలకం కానుంది.

అలాగే మూడో ప్యాకేజీలో భాగంగా 83వ కిలోమీటర్ నుంచి. నుంచి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట  అంటే 133.5వ కిలోమీటర్) వరకు పనులు చేపట్టనున్నారు. ఇందులో 50.5 కి.మీ. ప్రధాన ఓఆర్‌ఆర్‌తో పాటు నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కి.మీ. మేర నాలుగు వరుసల బైపాస్ అనుసంధాన రహదారిని నిర్మిస్తారు. అలాగే.. వల్లూరుపాలెం వద్ద కృష్ణా నదిపై 4.8 కి.మీ. పొడవైన భారీ వంతెనను కూడా ఈ ప్యాకేజీలో భాగంగానే నిర్మిస్తారు.  ఇక నాలుగో ప్యాకేజీ 133.5వ కి.మీ. నుంచి 189వ కి.మీ. (మొత్తం 55.5 కి.మీ.) వరకు సాగుతుంది. ఈ మార్గంలో పేరేచర్ల వద్ద 400 మీటర్ల సొరంగం, మున్నలూరు వద్ద కృష్ణా నదిపై 3.15 కి.మీ. పొడవున భారీ వంతెన  నిర్మిస్తారు.

ఈ మొత్తం ప్రాజెక్టు ద్వారా 189.93 కిలోమీటర్ల ప్రధాన రహదారితో పాటు అదనపు అనుసంధాన మార్గాన్ని కలుపుకుని మొత్తం 195.13 కి.మీ. మేర మార్గం  రూపుదిద్దుకోనుంది. ప్రాజెక్టు మొత్తానికి అంచనా వేసిన వ్యయం రూ.30,491 కోట్లలో   సివిల్ పనుల కోసమే నాలుగు ప్యాకేజీలలో  10 కోట్ల 595 లక్షల70 వేల రూపాయలు వ్యయం అవుతుందన్నది అంచనా. 

ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తయితే అమరావతి రాజధాని నగరానికి జాతీయ స్థాయి రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డు, భవిష్యత్తులో పారిశ్రామిక మరియు ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టెండర్ల ప్రక్రియ విజయవంతంగా ముగిస్తే, త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకోనున్నాయి. రాబోయే కాలంలో రాజధాని ప్రాంత రూపురేఖలను మార్చివేసే ఈ మహానగర రింగ్ రోడ్డు నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


[Amaravati Outer Ring Road, Amaravati ORR Tenders, Greenfield Highway, Amaravati Greenfield Highway, AP Capital Amarawati, Road connectivity, Telugu One]

By
en-us Political News

  
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.