వి.ఐ.పి. లకు అడ్డాగా మారుతున్న ఆళ్ళగడ్డ

Publish Date:May 18, 2012

Advertisement

కడప జిల్లాకు పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక గెలిచేది నీవా? నేనా? అన్నట్లు మూడు ప్రధాన ప్రార్తీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి. ప్రత్యేకించి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరులో తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటింగ్ పరంగా మూడు పార్టీల ప్రభావం కనిపించినా రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే నడుస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా పోటీలో అత్యల్ప మెజార్టీలే నమోదైనా వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అభ్యర్థులు కుతూహలపడుతున్నారు.

 

 

వీరితోపాటు ఈ రెండు నియోజకవర్గాలపైనా మూడు పార్టీల ప్రధాననేతలు దృష్టిసారించారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునాయుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహనరెడ్డి ముందుగానే ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు సహకరించాలని ప్రచారం చేశారు. చంద్రబాబు ఇక్కడ విజయం కోసం పట్టుపడు తున్నారన్న ప్రచారం జరగటంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత జగన్ ముందస్తు సర్వే నిర్వహించారు. ఆ సర్వే సూచనలను పాటిస్తూ ఆయన ఎమ్మిగనూరులో ఇంటింటికీ నడిచి తిరిగారు. జగన్ ఇలా తిరగటం ఆ పార్టీ నాయకులంతా ఆళ్ళగడ్డలో కార్యకర్తల సమావేశానికి వచ్చారు.

 

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉప ఎన్నికల పరిశీలకులు వాయలార్ రవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, టి.జి.వెంకటేష్, ఎంపీలు ఎస్.పి.వై. రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక్క రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒక్కరే రాలేదు. ఇదిలా ఉంటే ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల ప్రతాపరెడ్డి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా భూమా శోభానాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ప్రచారానికి ముందుగానే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించటంతో ఫలితాల్లో వీరిద్దరిలో ఒక్కరు విజయం సాధించినట్లు ప్రకటించవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. ఏమైనా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతాయని వారు భావిస్తున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.