ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి.!

Publish Date:Sep 22, 2026

Advertisement

 ఆదిలాబాద్   రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక చికిత్సా విభాగంలో  సోమవారం (సెప్టెంబర్ 21)అర్ధరాత్రి  దాటిన తరువాత సంభవించిన అగ్నిప్రమాదంలో  ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు..  అదే వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.  

సోమవారం అర్థరాత్రి సమయంలో రిమ్స్లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే చిన్నారులను కాపాడేందుకు ముందుకు దూకారు.  ఈ క్రమంలో వార్డులో ఉన్న 28 మంది శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను మాత్రం కాపాడలేకపోయారు.  

ప్రాథమిక అంచనాల ప్రకారం, వార్డులోని ఎయిర్ కండిషనర్‌కు సంబంధించిన విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే..  ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏమిటన్నది నిర్ధారించాల్సి ఉంది.  విద్యుత్ పరికరాల్లో సాంకేతిక లోపం తలెత్తిందా? ఏసీ వ్యవస్థలో సమస్య ఏర్పడిందా? మరేదైనా కారణంతో మంటలు వ్యాపించాయా? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.   మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్న చిన్నారులను బయటకు తరలించే చర్యలు చేపట్టారు. మరోవైపు, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ బిడ్డలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశించి ఆసుపత్రికి వచ్చిన ఆ చిన్నారుల తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని వేదనను మిగిల్చింది. 

ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ప్రమాదం ఎలా జరిగింది? అగ్నిప్రమాదం గుర్తించిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా ఎస్ఎన్‌సీయూ విభాగంలోని విద్యుత్ పరికరాలు, ఏసీ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాల పనితీరుపై దృష్టి సారించారు. 


ఇలా ఉండగా రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు శిశువులు మరణించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి సమగ్ర నివేదిక అందించాలని రేవంత్ ఆదేశించారు.  కాగా మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

[Adilabad RIMS fire accident, two infants dead, Telangana news, hospital fire accident, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కల సాకార దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి..!
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
హుస్సేన్‌సాగర్ వద్ద బారికేడ్లు తొలగించిన ఉత్సవ సమితి.. పలువురు అరెస్ట్..!
బీఆర్‌ఎస్ సీనియర్ నేత,  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాజెక్టు ముట్టడికి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంతో వనపర్తిలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
తన జన్మదిన వేడుక అన్నది  ఏ  రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చిన ప్రీతీరెడ్డి...  ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలు కేవలం తన శ్రేయోభిలాషులు, అభిమానులు, కాలేజీ సిబ్బంది,   ఆసుపత్రి స్టాఫ్ తమ అభిమానంతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినవన్నారు.  పుట్టినరోజు వేడుకలను కూడా రాజకీయం చేస్తూ తమ ఫ్లెక్సీలను చింపేయడం, వికృత చేష్టలకు పాల్పడడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జరిగిన హృదయ విదారక ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
సత్యం స్కాం భూములు.. కేటీఆర్ కుటుంబం చేతికి ఎలా వచ్చాయి..?
లేడీ గెటప్‌లో వచ్చి.. సీసీటీవీలపై స్ప్రేల దాడి..!
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే చప్పుళ్లకు వరుస గుండెపోటు మరణాలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.