తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో పురుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు. మొత్తం రెండు లక్షల 50 వేల 46మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు లక్షా 26వేల 535 మంది ఉన్నారు. మహిళలు లక్షా 23వేల 511మంది ఉన్నారు. అంటే మూడు వేల 24 మంది పురుషులే ఎక్కువగా ఓటర్లుగా నమోదయ్యారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2,886మంది కొత్తగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు. ఈయన తరుగాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి పోటీలో నిలుస్తున్నారు. చివరిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమాన కరుణాకరరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. సమైక్యవాదంతో వెంకటరమణ ముందంజలో ఉండటం, ఓటర్లలో పురుషులు ఎక్కువగా ఉండటం, మహిళలకు కూడా కాంగ్రెస్ ఇటీవల రుణాలు మంజూరు చేయటం కాంగ్రెస్ కు అనుకూల అంశాలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావటం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్పందన రావటం, మాజీ ఎమ్మెల్యేగా అనుభవం ఉండటం కూడా చదలవాడకు ఫేవర్ అని భావిస్తున్నారు. విజయమ్మ ప్రచారం, టిడిపి ఛైర్మన్ గా గతంలో పనిచేసిన అనుభవం, వైఎస్ సర్కారులో ఉన్నప్పుడు పరిచయాలు వై.కా.పా. అభ్యర్థి భూమాన కరుణాకరరెడ్డికి కలిసి వచ్చే అంశాలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-tirupati-by-polls-24-14612.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.