చంద‌న స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు...చందాలు అడుక్కోవ‌డ‌మేంటి?

Publish Date:Mar 27, 2026

Advertisement

 

స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి? ఆమె తండ్రి దాచిన సొమ్మంతా ఏమైంది? ఇంత‌కీ ఆ డ‌బ్బు ఎక్క‌డుంది? ఆ వివ‌రాలేంటి?  విద్యారాణి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏయే పార్టీలు మారింది?  ప్ర‌స్తుత పార్టీ ప‌రిస్థితేంటి? అస‌లేంటి విద్యారాణి రాజ‌కీయం?

చంద‌న‌పు దొంగ వీర‌ప్ప‌న్ పేరు వింటే ఇప్ప‌టికీ స‌త్య మంగ‌ళం అడ‌వులు గ‌జ‌గ‌జ‌లాడుతాయి. వేల కోట్ల విలువైన చంద‌న‌పు చెక్క‌లు, ఏనుగు దంతాలు స్మ‌గ్లింగ్ చేసిన వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి ప్రస్తుతం రాజ‌కీయాల్లో రాణించ‌డానికి చందాలు అడుగుతున్నారు. మ‌రి స్మ‌గ్లింగ్ చేసి వీర‌ప్ప‌న్ సంపాదించిన సొమ్మంతా ఏమైన‌ట్టు? ఆయ‌న కుటుంబానికి మ‌రీ ముఖ్యంగా త‌న రాజ‌కీయ కుమార్తెకు అంత పేద‌రిక‌మేంటి?  ఇంత‌కీ విద్యారాణి తండ్రి సంపాదించిన ఆ నిధి మొత్తం ఏమైన‌ట్టు? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఆ కాలంలోనే వీర‌ప్ప‌న్ సుమారు రూ.150 కోట్ల  విలువ చేసే చంద‌న‌పు చెక్క‌లు, ఏనుగు దంతాల‌ను స్మ‌గ్లింగ్ చేశాడ‌ని అంచ‌నా. ఇక క‌న్న‌డ కంఠీర‌వ‌గా పేరున్న రాజ్ కుమార్‌ని  కిడ్నాప్ చేసిన‌పుడు సుమారు 15 నుంచి ఇర‌వై కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేశాడ‌ని చెబుతారు. అయితే ఈ డ‌బ్బు ప్ర‌స్తుతం ఎక్క‌డుంది?  ఇప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం ఈ మొత్తం కొన్ని వేల కోట్ల విలువ చేస్తుంది. మ‌రి ఆ సొమ్ము మొత్తం ఏమైన‌ట్టు అన్న  ప్ర‌శ్న‌ల‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  

వీర‌ప్ప‌న్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే.. ఈ మొత్తం బ్యాంకుల్లో కాకుండా ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో చుట్టి అడ‌వుల్లో, గుహ‌ల్లో, చెట్ల కింద పాతిపెట్టాడ‌ని అంటారు. అయితే వీర‌ప్ప‌న్ చ‌నిపోయాక‌.. పోలీసులు జ‌రిపిన గాలింపుల్లో కేవ‌లం ఆహార ధాన్యాలు త‌ప్ప‌.. భారీ న‌గ‌దు ల‌భించ‌నే లేదు. ఇంత‌కీ వీర‌ప్ప‌న్ తాను సంపాదించిన సొమ్ము ఏం చేసేవాడ‌ని చూస్తే.. త‌న గ్యాంగ్ నిర్వ‌హ‌ణ‌కు ఇన్ ఫార్మ‌ర్ల‌కు, ఆయుధాల‌కు, అడ‌వి ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డానికే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసేవాడ‌ని అంటారు.

కొంద‌రు ఏమంటారంటే ఆ డ‌బ్బు ఎక్క‌డుందో తెలిసిన వారంద‌రూ కూడా ఎన్ కౌంట‌ర్ల‌లో చ‌నిపోయార‌ని చెబుతారు. దీంతో ఆ డ‌బ్బు మొత్తం అడ‌వి మ‌ట్టిలో క‌ల‌గ‌ల‌సిపోయి ఉంటుంద‌నే భావిస్తున్నారు. అందుకే విద్యారాణికి త‌న తండ్రి నుంచి వార‌స‌త్వంగా ఎలాంటి సంప‌దా క‌ల‌సిరాలేద‌ని అంటారు.బేసిగ్గా అయితే విద్యారాణి తాను చ‌దివిన చ‌దువు ప్ర‌కారం ఒక లాయ‌ర్. సామాజిక కార్య‌క‌ర్త  కూడా. త‌న తండ్రికి ద‌క్షిణాది రాబిన్ హుడ్ గా ఉన్న ఇమేజీని వాడుకుని.. రాజ‌కీయాల్లో ఎద‌గాల‌ని చూస్తున్నారు.

విద్యారాణి మొద‌ట ప‌ట్టాలి మ‌క్క‌ల్ క‌ట్చి, అనే పార్టీలో చేరారు. త‌ర్వాత అంటే 2020లో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ యువ‌జ‌న విభాగంలో కీల‌క ప‌ద‌విలో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం అంటే 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఆమె బీజేపీని వీడి,, శీమాన్ నేతృత్వంలోని నామ్ త‌మిళ‌ర్ క‌ట్చిలో చేరారు. కృష్ణ‌గిరి ఎంపీగా  పోటీ చేసి ఓడిపోయారు.
 
ప్రస్తుతం విద్యారాణి నామ్ తమిళర్ కట్చి-NTKలోనే కొనసాగుతున్నారామె. 2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెట్టూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ పార్టీ అభ్య‌ర్ధిగా పోటీ  చేస్తున్నారు వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి. అయితే త‌న ఎన్నిక‌ల ప్ర‌చారానికి.. త‌గిన డ‌బ్బు త‌న ద‌గ్గ‌ర లేద‌ని.. తండ్రి  సంపాద‌న‌లో ఏదీ త‌న‌కు ద‌క్క‌లేద‌ని చెబుతూ.. సోష‌ల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. వాటి  ద్వారా చందాల‌ను ఆశిస్తున్నారు. త‌న  తండ్రి అడ‌వి బిడ్డ‌ల కోసం పోరాడార‌నీ.. తాను కూడా అదే బాట‌లో న‌డుస్తాన‌ని న‌మ్మ‌బలుకుతున్నారు.

స‌త్య‌మంగ‌ళం అడ‌వుల్లో.. కోట్లాది రూపాయ‌ల సామ్రాజ్యాన్ని విస్త‌రించిన ఒక స్మ‌గ్ల‌ర్ వార‌సురాలు నేడు త‌న ద‌గ్గ‌ర ఏదీ లేద‌ని చెబుతూ.. చందాలు అడ‌గ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న  తండ్రి  పై ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి, క్రేజ్ ని వాడుకుని ఎలాగైనా స‌రే చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు

By
en-us Political News

  
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.