తమిళ నాడులో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చిందంటే, అందుకు కారణం ఒకేఒక్కడు. ఆ ఒక్కడు మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అలాగే కమల దళానికి రాష్ట్రంలో అంతో ఇంతో రాజకీయ విజయం దక్కిందంటే ఆ క్రెడిట్ కూడా అన్నామలై అకౌంటులోనే చేరుతుంది. అంతే కాదు సూది మొలంత చోటు లేని రాష్ట్రంలో ఉరూరా కాషాయ జెండా ఎగురుతోందంటే అది కూడా ఆయన ఖాతాలోనే చేరుతుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. తొలివిడతలో మాత్రం పాత కొత్త వారికి ఓ మూడు పదవులు ఇచ్చారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లు తున్న భద్రాద్రి రాములోకి కల్యాణం కోసం ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరి స్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తి ప్రచారమేనా అంటే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది.
వైకాపా నేత లక్ష్మి పార్వతికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని 2009లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరి విల్లు చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటి సివిల్ కోర్టు చట్టబద్దంగా వ్యవహరించలేదని పేర్కొంది. విల్లుపై సాక్షి సంతకం చేసిన జె. వెంకట సుబ్బయ్య వారసుడు జెవి ప్రసాదరావు సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది.
తేనెకళ్ల సుందరి, మహాకుంభమేళా మోనాలిసాకు సినిమా చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించి ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిపోయిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిత్రా ఇప్పుడు మరో కారణంతో పాపులర్ అయ్యాడు. అత్యాచారం, అసభ్య వీడియోలు తీసి బెదరించడం ఆరోపణలపై అరెస్టై మరో సారి వార్తల్లో నిలిచాడు.
జార్ఖండ్ లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెడుతున్న గూడ్సు రైలు బర్హెట్ లో ఆగి ఉన్న మరో గూడ్సు రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీకి బలమైన సవాల్ విరారు. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని శపథం చేశారు. ఎక్కడో కాదు.. లోక్ సభ వేదికగా బీజేపీని ఉద్దేశించి రాసి పెట్టుకోండి ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతాం అని సవాల్ విసిరారు. చక్కటి హిందీలో ఒకటికి రెండుసార్లు ఆప్ లిఖ్కే లేలో.. లిఖ్కే లేలో ఔర్ ఆప్ కో హమ్, గుజరాత్ మే హరాయింగే ఇస్ బార్ అని సవాల్ విసిరారు.
Publish Date:Mar 31, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 1) తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Publish Date:Mar 31, 2025
కుప్పం గంగమ్మఆలయ పాలక మండలి చైర్మన్ గా బీఎంకే రవిచంద్రబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియమించారు. ఆయనతో పాటు 10 మంది సభ్యులను కూడా నియమించారు.
Publish Date:Mar 31, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
Publish Date:Mar 31, 2025
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.