వైకాపా నేత లక్ష్మి పార్వతికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని 2009లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరి విల్లు చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటి సివిల్ కోర్టు చట్టబద్దంగా వ్యవహరించలేదని పేర్కొంది. విల్లుపై సాక్షి సంతకం చేసిన జె. వెంకట సుబ్బయ్య వారసుడు జెవి ప్రసాదరావు సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. సాక్షి సంతకం చేసిన ప్రసాదరావు కనీసం తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కూడా సిటి సివిల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదని అయినప్పటికీ దిగువ కోర్టు ప్రసాదరావు నోటి మాట ఆధారంగా సాక్షిగా పరిగణలో తీసుకోవడం చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానింది. క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై లక్ష్మిపార్వతికి అనుకూలంగా రావడాన్ని ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ లు హైకోర్టులో సవాల్ చేశారు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారి చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lakshmi-parvathi-gets-a-shock-in-the-high-court-39-195366.html
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.
శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ భాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ భాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు.
తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 6) స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు.
పార్లమెంట్ సమావేశాలంటే, ఏముంది? మూడు వాయిదాలు, ఆరు వాకౌట్లు. కాదంటే, గౌరవ సభ్యుల అరుపులు, కేకలు.. నిరసనలు, నినాదాలు, ఇంతే కదా అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చును. తప్పు కాదని చెప్ప లేము.
అవును మరి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని కదా అంటారు. సో.. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరం చూస్తున్నది అదే అయినప్పుడు.. కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్ర విచిత్ర, విన్యాస వికారాలను, కాదని అనడం కుదరదు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్ లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజుకు ఒకరి పైన కేసులు నమోదు అవుతున్నాయి.
రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య ఆధిపత్యపోరు పోరు తార స్థాయికి చేరుకుంది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్ఠను కూడా బజారున పడేస్తున్నది.