ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్.. విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్!

Publish Date:Apr 1, 2025

Advertisement

గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తి ప్రచారమేనా అంటే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఒక సందర్భంలో నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం, తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా చేతబట్టి అభిమానులను అలరించడం చూస్తుంటే నందమూరి కుటుంబంలో విభేదాలు అన్నది వట్టి ప్రచారమే అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ఆరంభించారు. ఆ సందర్భంగా నూజివీడు మండలం సీతారామపురంలో తెలుగుదేశం మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు. తద్వారా తమ మధ్య విభేదాలన్నవేవీ లేవని చాటారు. ఇది నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. లోకేష్ ఎన్టీఆర్ ప్లెక్సీని పట్టుకున్న ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా పట్టుకుని హల్ చల్ చేశారు. నరసరావు పేటలో పర్యటించిన హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా  చేతపట్టుకుని సందడి చేశారు. దీంతో తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ జోష్ అయ్యారు. ఈ రెండు సంఘటనలూ కలిపి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబానికి ఒకింత దూరం మెయిన్ టైన్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అవగత మౌతుంది. 
అయితే గతంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలే ఈ విభేదాల ప్రచారానికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు. గతంలో ఒక సారి నందమూరి కల్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూతో  మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు ఇంకే పార్టీకి మా తాత స్థాపించిన తెలుగుదేశానికే అని చెప్పకుండా.. తన సోద రుడు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం. కుటుంబ కార్యక్రమాల్లో నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పెద్దగా కనిపించకపోవడం ఈ ప్రచారానికి కారణమయ్యాయి. అయితే పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని విస్పష్టంగా చెప్పినా.. ఈ ప్రచారానికి తెరపడలేదు. ఇందుకు కారణం ఈ విషయంలో బాలకృష్ణ స్పందించకపోవడమేనని అంటారు. అంతే కాకుండా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేయమంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా విభేదాల ప్రచారానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పడు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. 

ఇందుకు బాలయ్యే చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ.. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలాగే ఎన్టీఆర్ మనవడిగా సీనీ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగారు.  అయితే వీరి మధ్య విభేదాల ప్రచారం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలకు కూడా కారణమయ్యాయి.

జూనియర్ ఎన్టీఆర్ పదేపదే  తనకి బాబాయ్ బాలకృష్ణకి ఎలాంటి విబేధాలు లేవు చెబుతూ వస్తున్నా.. ఈ ప్రచారానికీ, ఫ్యాన్స్ మధ్య గొడవలకూ తెరపడలేదు. అయితే ఇప్పుడు ఎటువంటి అరమరికలూ లేకుండా బాబాయ్- అబ్బాయ్ లు ఒకే వేదికపై కనిపించి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందుకు మే 28న ఘనంగా జరగనున్న ఎన్టీఆర్ జయంతి వేడుక వేదిక కానుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వేడుకకు ఆయన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఆహ్వానించనున్నారని చెబుతున్నారు.

కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగలా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి కూడా మహానాడును కడప వేదికగా నిర్వహించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆ మహానాడుకు బాలకృష్ణ కూడా హాజరౌతారు. మరి బాలకృష్ణ నిర్వహించే కుటుంబ వేడకకు కూడా మహానాడే వేదిక అవుతుందా?  మహానాడు వేదికగా జరిగే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు హాజరౌతారా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. దీంతో ఒకే వేదికపై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు అన్నది ఒట్టి ప్రచారం మాత్రమేనని తేలిపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వదం తులకు కూడా చెక్ పడుతుందని తెలుగుదేశం, నందమూరి అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.  

By
en-us Political News

  
సినీ ఇండస్ట్రీపై మోజుతో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి దందాలు వరుసగా బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్‌ కసిరెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు.
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షిండమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు రెడీ అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి ఆయన జపాన్ పర్య టనకు బయలుదేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22 వరకు అంటే ఆరు రోజుల పాటు రేవంత్ జపాన్ లో పర్యటించనున్నారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం (ఏప్రిల్ 16) సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరుకానున్నట్లు ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ అంగీకరించింది. దీంతో ఆయన బుధవారం (ఏప్రిల్ 16)న సిట్ విచారణకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 15)న జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెక్రటేరియెట్ వరకూ వచ్చారు. అయితే సమావేశానికి హాజరు కాకుండా ఆయన తన క్యాంప్ ఆఫీస్ కువెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయి రెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంలో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (ఏప్రిల్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ స్పిన్ తో మ్యాజిక్ చేశాడు. దాంతో కోల్ కతా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్ అంటేనే బంతిపై బ్యాట్ ఆధిపత్యం.. పరుగుల వరద పారుతుంది.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయననే అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు మాజీ సీఎం జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరింత పెరిగినట్లైంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సకుటుంబ సమేతంగా ఈ నెల 16న ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబు అక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెడతారు.
ప్రశాంత్ కిషోర్, పీకే .. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది.అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. జన సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రద్దుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నంల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.