ప్రియాంకను చూసి నేర్చుకోండి !

Publish Date:Mar 29, 2025

Advertisement

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా  కు పరిచయమ అవసరం లేదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోదరి. అంతే కాదు, గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ ( కేరళ) నియోజక వర్గం ప్రస్తుత ఎంపీ ప్రియాంక. 2024 ఎన్నికల్లో రాహుల గాంధీ  వయనాడ్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు.  ఆ తర్వాత  రాహుల్ గాంధీ అమేథీని ఉంచుకుని  వయనాడ్ ను వదిలేశారు. సొంత నియోజక వర్గం అమేథీ ఎంపీగా కొనసాగుతున్నారు. అలా రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్  లోక్ సభ స్థానానికి   జరిగిన ఉపఎన్నికల్లో ప్రియాంక వాద్రా కాంగ్రస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. గెలిచారు. ఇప్పడు, ఆమె వయనాడ్  ఎంపీ.

అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా  ఇప్పడు  ఆమె గురించి మాట్లాడుకోడానికి ఓ మంచి కారణమే వుంది. ఆమె ఓ మంచి బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె  తమ నియోజక వర్గం ప్రజల మాతృ భాష మలయాళం నేర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో  కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ ఇచ్చిన సలహా మేరకు తాను  ప్రత్యేకంగా ఒక టీచర్ ను పెట్టుకుని మరీ మళయాళం నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు  ఇప్పటికే తనకు మలయాళం కొంచెం కొంచెం అర్థమవుతోందని, కుంచెం కుచెం   మాట్లాడగల్గుతున్నానని  చెప్పారు. సంతోషం. అభినందనీయం.  
ఐదేళ్ళు అదే వయనాడ్  నియోజక వర్గానికి ప్రాతినిత్యం వహించిన రాహుల్ గాంధీకి మలయాళం ఎంత వచ్చునో, ఎంత రాదో మనకు తెలియదు కానీ, ఉప ఎన్నికల్లో గెలిచి ఇంకా ఐదు నెలలు అయినా కాక ముందే ప్రియాంక  మలయాళం నేర్చుకోవడం  అభినందనీయం. అన్నిటినీ మించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకునేదుకు  వారి మాతృ భాష నేర్చుకోవాలని  ఆంటోనీ ఇచ్చిన సలహాను అక్కడే మరిచి పోకుండా   ఆచరణలో పెట్టడం చాలా చాలా అభినందనీయం.   

సహజంగా  ప్రజాప్రతినిధులకు తాము ప్రాతినిధ్యం వహించే’ నియోజక వర్గం ప్రజల భాష వచ్చే ఉంటుంది. కానీ  ఇదిగో ఇలా వలస వెళ్లి వేరే రాష్టాల నుంచి పోటీ చేయవలసి వచ్చి నప్పుడే భాషా సమస్య వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది నాయకులు దక్షణాది రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు  భాషా సమస్యను ఎదుర్కుంటారు. 

గతంలో  1999లో కర్ణాటకలోని బళ్ళారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికలో  కాంగ్రెస్ అభ్యర్ధిగా, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అభ్యర్ధిగా  సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఇద్దరికీ  కన్నడం రాదు. సోనియా గాంధీ ఏ భాషలో మాట్లాడారో ఏమో కానీ,   సుష్మాస్వరాజ్  మాత్రం పట్టుపట్టి కన్నడం నేర్చుకున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కన్నడంలో ప్రసంగించారు. అయినా  ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు. సుష్మా స్వరాజ్ ఓడి పోయారు. ఓడిపోతే  ఓడి పోయారు కానీ, ఆమె చాలా తక్కువ సమయంలో అంటూ  30 రోజులకంటే తక్కువ రోజుల్లో  కన్నడ  భాష నేర్చుకున్నారు. 
సరే  ప్రజాప్రతినిధులు అందరూ సుష్మా స్వరాజ్ లా పక్షం రోజుల్లోనే పరాయి భాష నేర్చుకోలేక పోవచ్చును. పీవీ నరసింహ రావులాగా  14 భాషల్లో మాట్లాడలేక పోవచ్చును కానీ, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రజల భాష మాట్లాడ లేక పోవడం మాత్రం, ఆక్షేపణీయం. ఒక రకంగా అది వారికే అవమానం. 

 కానీ తెలుగురాష్ట్రంలోనూ ప్రజల భాష తెలుగు రాని ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ శాసన సభ విషయాన్నే తీసుకుంటే, ఎంఐఎం  పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 20 ఏళ్లకు పైగానే  తెలుగు సభ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలోని చాంద్రాయగుట్ట నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు,ఆయన తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ  కూడా ఎమ్మెల్యేలుగా,  ఎంపీలుగా ఉన్నారు. అయినా ఆయనకు గానీ, అయన కుటుంబ సభ్యులకు గానీ తెలుగు రాదు.ఇంగ్లీష్ లో  అయితే అనర్గళంగా మాట్లాడతారు. అవసరం అనుకుంటే  తమ ఓటర్ల  కోసం ఉర్దూలోకి షిఫ్ట్ అవుతారు. కానీ తెలుగులో మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేరు. మాట్లాడ లేక పోవడం  మాత్రమే కాదు. కనీసం అర్థం చేసుకోలేరు. తెలుగు రాష్ట్రంలో పుట్టి  తెలుగు రాష్ట్రంలో పెరిగి,  20 ఏళ్లకు పైగా తెలుగు శాసనసభలో సభ్యునిగా ఉండి మెజారిటీ సభ్యులు, మంత్రుల తెలుగు ఉపన్యాసాలు  వింటూ కూడా ఆయనకు తెలుగు తలకెక్కలేదు.  
అయితే  ఆయన మంత్రి సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్ రాదని ఆక్షేపించారు. మంత్రికి ఇంగ్లీష్, ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు, పరస్పరం ఒకరిని  ఒకరం అర్థంచేసుకోలేక పోతున్నాం.  అంటూ తనకు తెలుగు రానందుకు  క్షమాపణలు చెప్పారు. కానీ  అదే సమయంలో ఆయన మంత్రి సీతక్కను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాద మయ్యాయి. 

అయినా ఇప్పటికైనా  ప్రియాంకను ఆదర్శంగా తీసుకుని అయినా ఒవైసీ సోదరులు తెలుగు నేర్చుకుంటారేమో చూద్దాం. నిజానికి  ఒవైసీ సోదరులు మాత్రమే కాదు  ప్రజల భాష రాని ప్రజా ప్రనిధులు ఇంకా ఉండే ఉంటారు. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ కు ఒరియా భాష రాదని అంటారు. అది ఎంత వరకు నిజమో కానీ  ప్రజాప్రతినిధులకు ప్రజల భాష రావడం అవసరం. అది ఒవైసీలు కావచ్చును, మరొకరు కావచ్చును.

By
en-us Political News

  
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీకి బలమైన సవాల్ విరారు. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని శపథం చేశారు. ఎక్కడో కాదు.. లోక్ సభ వేదికగా బీజేపీని ఉద్దేశించి రాసి పెట్టుకోండి ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతాం అని సవాల్ విసిరారు. చక్కటి హిందీలో ఒకటికి రెండుసార్లు ఆప్ లిఖ్కే లేలో.. లిఖ్కే లేలో ఔర్ ఆప్ కో హమ్, గుజరాత్ మే హరాయింగే ఇస్ బార్ అని సవాల్ విసిరారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 1) తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
కుప్పం గంగమ్మఆలయ పాలక మండలి చైర్మన్ గా బీఎంకే రవిచంద్రబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియమించారు. ఆయనతో పాటు 10 మంది సభ్యులను కూడా నియమించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు అయినా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు మండలాల ప్రకటన సరిగా జరగలేదు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు.
పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సోమవారం విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి నానా హడావుడి చేసిన జగన్ సర్కారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో తన నివాసం కోసం రుషికొండను తొలిచి ప్రజాధనంతో ఒక భారీ ప్యాలెస్ మాత్రం జగన్ కట్టించారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో కూటమి సర్కారు ఉంది.
వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది.
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.