Publish Date:Mar 31, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయనీ, ఆయన ఆచరణ అంతకంటే గొప్పగా ఉంటుందనీ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.
పారిస్‌లో తమ రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ ఒక వీడియోను కూడా ఆ పోస్టుతో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరడం, వరల్డ్‌వైడ్‌గా తగిన గుర్తింపు లభించడం ర్తిదాయకమని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anand-mahindra-praise-cbn-39-195342.html
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు సుప్రీంలో విచారణలో ఉండగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చాలా రోజుల తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు విప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు.
తెలుగు రాష్ట్రాలలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
తెలంగాణ లో సంచలనమైన నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండ రేప్ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. మొక్కులు తీర్చుకునేందుకు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన వారు భార్యభర్తలు కాదని పోలీసుల దర్యాప్తులోవెల్లడైంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న జంట భార్యా భర్తలు కాదని తెలుసుకున్న నిందితులు యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్లు, ప్రేమికులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడేవారని వెల్లడైంది.
ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది. ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం( 02 ఏప్రిల్) విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు చేపట్టిన నిరసనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీసీలకు రజర్వేషన్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేతలు అధికార మదంతో వ్యవహరించారు. వైఎస్ జగన్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమతో హద్దులు మీరి ప్రవర్తించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు.. సామాన్య ప్రజలనుసైతం నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు.
వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ తింటున్న నక్సల్స్ ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి పేరిట కేంద్రానికి ఓ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా స్పందించారు. .
నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, హై-టెక్నాలజీ సేవలను అభివృద్ధిలో దిగ్గజ సంస్థ అయిన సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల రవిచంద్రారెడ్డిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేయడం కాదు.. పక్కన పడేసింది అనడం సబబు.
పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది. మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు