తమిళనాడు సీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్.. ఆ జీవోలు రద్దు.!

Publish Date:Jul 28, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.  తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కు తగిలిన గట్టి ఎదురుదెబ్బ ఇదేనని చెప్పవచ్చు. గతంలో కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన   బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. 

అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ  నిర్ణయానికి అత్యున్నత న్యాయస్థానంలో బ్రేక్ పడటం  తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ   బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో  41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.   ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. 

 ఈ తరువత  తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయ్.. ఆ హామీని నెరవేరుస్తూ తొక్కిసలాట  మృతుల కుటుంబాలలో  32 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. అయితే.. సాధారణ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి పోటీ పరీక్షలు, అధికారిక నియామక ప్రక్రియ లేకుండా ఇలా ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాలను కేటాయించడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది.

ఆ పిటిషన్ ను విచారించిన  మద్రాస్ హైకోర్టు ధర్మాసనం..  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేస్తూ  తీర్పు  వెలువరించింది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్  వంటి రాజ్యాంగబద్ధమైన నియమక సంస్థల ప్రక్రియల ద్వారా కాకుండా..  చట్ట పరిమితులను దాటి ఉద్యోగాలు కేటాయించడం సమర్థనీయం కాదని పేర్కొంది.  ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ   సమాన అవకాశాల సూత్రానికి లోబడి ఉండాలని ఆదేశించింది. అంతే కాకుండా, కరూర్ దుర్ఘటనపై సీబీఐ  విచారణ  సాగుతున్న తరుణంలో ఇటువంటి నియామకాలు చేపట్టడం సరి కాదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.  

 Madras high court shock to CM Vijay, Karur Stampede, Tamil Nadu News, TVK Party 

By
en-us Political News

  
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
E20 పెట్రోల్ అంశంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం మరియు డీప్‌ఫేక్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలపై పరువు నష్టం దావా వేసేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.