భోగాపురం.. కేవలం ఎయిర్ పోర్ట్ కాదు.. ఒక మహా నగరం.!

Publish Date:Jul 28, 2026

Advertisement

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల  స్వప్నం సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద  అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించి,  జాతికి అంకితం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో ఉత్తరాంధ్ర రవాణా రంగంలోనే కాకుండా పారిశ్రామిక, ఆర్థిక చిత్రపటంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది.

విశాఖపట్నం-విజయనగరం మధ్య జాతీయ రహదారికి సమీపంలో జీఎంఆర్  సంస్థ  ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీనికి రూపకల్పన చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దశలవారీగా ఏటా నాలుగు కోట్ల మందికి పైగా ప్రయాణించేలా సామర్థ్యాన్ని విస్తరించే   ప్రణాళికతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ ఎయిర్‌పోర్టులో భారీ విమానాలు అంటే కోడ్ 4ఈ కేటగిరీ ఫ్లైట్స్ సులభంగా రాకపోకలు సాగించేలా 3 వేల 800 మీటర్ల పొడవైన రన్ వేను  అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల రవాణా సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి కార్గో సదుపాయాలను కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు స్థానిక ఉత్పత్తులు, ఫార్మా, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు  ఊతం లభించనుంది.

ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు   జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ఇంత వేగంగా పూర్తి కావడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలక పాత్ర పోషించాయి. అత్యంత ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్, విశాలమైన టెర్మినల్ నిర్మాణంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక ప్రధాన ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది.

ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర పరిధిలోని పరిశ్రమలు, ఐటీ రంగాలు, పర్యాటకం విపరీతంగా పుంజుకోనున్నాయి. స్థానిక యువతకు వేలాదిగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయంగానే కాకుండా, సమీప భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదిగేందుకు బలమైన పునాది పడిందంటున్నారు. 

Bhogapuram International Airport,   Alluri Sitarama Raju Airport, Narendra Modi Bhogapuram Visit,  North Andhra Development Vizag 

By
en-us Political News

  
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
E20 పెట్రోల్ అంశంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం మరియు డీప్‌ఫేక్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలపై పరువు నష్టం దావా వేసేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.