పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం: పవన్, అన్నా సంయుక్త ప్రకటన: 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.!

Publish Date:Nov 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తాము విడాకులు తీసుకుంటున్నట్లు చేసిన సంయుక్త ప్రకటన సంచలనంగా మారింది.  . తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు. పిల్లల బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామనీ, . ఇది   పూర్తి అవగాహనతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అని, ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

1996లో నందిని పవన్ వివాహం చేసుకున్నారు. పరస్పర విభేదాల తర్వాత 2008లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ప్రముఖ నటి రేణు దేశాయ్ ను పవన్ 2009లో వివాహం చేసుకుని, 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య సంతానం. రష్యన్ నటి అన్నా లెజెనేవా (అన్నా కొణిదెల)ను 2013లో పవన్ పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించారు.

దాదాపు పదమూడేళ్ల పాటు సాగిన వివాహ బంధం నుంచి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోమవారం (నవంబర్ 9) రాత్రి  సంయుక్త ప్రకటన ద్వారా వారు వెల్లడించారు.   జనసేన అఫీషియల్ పోర్టల్స్ ద్వారా వారీ ప్రకటన విడుద చేశారు.   తామిద్దరం కలిసి జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలను పంచుకున్నామని, అయితే ఇప్పుడు పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్న వారు.. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినా, తమ మధ్య స్నేహం, పరస్పర అభిమానం, గౌరవం చెక్కుచెదరకుండా ఉంటాయని పేర్కొన్నారు. అదే విధంగా  తమ పిల్లల బాధ్యతను  చూసుకుంటామని, వారి సంక్షేమం, సంతోషమే తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని పవన్ కల్యాణ్, అన్నాఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

  ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలనీ,   తమకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వివాహ బంధం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించినప్పటికీ, చట్టపరమైన ప్రక్రియలకు సంబంధించిన   వివరాలను వారు ఆ ప్రకటనలో పేర్కొన లేదు.  పరస్పర అంగీకారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  షాకిచ్చిన పవన్ కళ్యాణ్ సతీమణి: ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ అసలు కారణం ఇదేనా.?

ఈ పరిణామానికి సంబంధించి గతంలో   సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలు ఇప్పుడు మళ్లీ విస్తృతంగా చర్చకు వస్తున్నాయి.   అన్నా కొణిదెల కొద్ది వారాల క్రితమే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా డీయాక్టివేట్ చేశారు.   మామూలుగా అన్నా కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన జిమ్ ఫొటోలు, పీఠాపురం పర్యటన తదితర  జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునేవారు. ఆమె సోషల్ మీడియా నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడం ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు పవన్, అన్నా సంయుక్త ప్రకటన నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా నుంచి వైదొలిగిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల వివాహం సెప్టెంబర్ 2013లో   జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలుఉన్నారు. ప్రజా జీవితంలో  బిజీగా ఉండే పవన్ కళ్యాణ్, రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కుటుంబ వ్యవహారాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు.  సుదీర్ఘకాలం పాటు సాగిన వీరి వైవాహిక బంధం ముగియడం రాజకీయ వర్గాలతో పాటు అభిమానులలోనూ విస్మయాన్ని కలిగించింది.  

మీకు నచ్చవచ్చు:  పవన్ కళ్యాణ్ బాటలో అన్నా కొణిదెల..  6,30,000 రూపాయలతో 

ప్రజా జీవితంలో ఉంటూనే వ్యక్తిగత నిర్ణయాలను పారదర్శకంగా వెల్లడించిన ఈ ఉదంతం డిజిటల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరువురి భవిష్యత్తు ప్రయాణం, పిల్లల బాధ్యతల నిర్వహణ ఏ విధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

[Pawan Kalyan Anna Konidela Divorce, AP Deputy CM Pawan Kalyan Divorce,  Pawan Kalyan wife separation, Combined Statement, TeluguOne]

By
en-us Political News

  
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.