రామోజీరావు ఒక ఎన్ సైక్లోపీడియా: యువతకు మార్గదర్శి.!

Publish Date:Oct 29, 2026

Advertisement

తెలుగు మీడియా రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి, దశాబ్దాల పాటు పత్రికా రంగాన్ని శాసించిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  

ఇందులో ప్రధానంగా రామోజీరావు  అసాధారణ  పాలనా శైలి, నిర్ణయాలు తీసుకునే విధానం, ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆయన చేసే కసరత్తు గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే, ఆ రంగంపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవడం, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోటీదారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు తదితర అంశాలపై రామోజీరావు సమగ్ర అధ్యయనం చేసేవారని డీఎన్ ప్రసాద్ చెప్పారు.   ఒక బిజినెస్ ప్లాన్ వేసేటప్పుడు దాని తుది ఫలితాన్ని ముందుగానే ఊహించగలగడం రామోజీరావు ప్రత్యేకత అన్నారు.  కేవలం పత్రికా రంగమే కాకుండా ప్రియా పచ్చళ్లు వంటి వ్యాపారాలలో కూడా ఆయన ఇదే సూత్రాన్ని పాటించి అగ్రగామిగా నిలిచారని గుర్తుచేశారు.

అలాగే..  మార్గదర్శి చిట్ ఫండ్,  ఈనాడు గ్రూప్‌పై గతంలో జరిగిన రాజకీయ దాడులు, ప్రత్యర్థుల నుంచి ఎదురైన తీవ్రమైన ఒత్తిళ్ల గురించి కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొన్ని వర్గాలు రామోజీరావును, ఆయన సంస్థలను ఇబ్బంది పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయని, మార్గదర్శిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక అడ్డంకులు సృష్టించారని వెల్లడించారు. అనారోగ్యంతో మంచంపై ఉన్న సమయంలోనూ వేధింపులకు గురిచేసేలా కుట్రలు పన్నారని, అయినప్పటికీ రామోజీరావు ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఆత్మస్థైర్యంతో ప్రతిఘటించారని గుర్తు చేశారు. చట్టపరమైన పోరాటాలు చేస్తూనే వ్యవస్థల ఒత్తిళ్లను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

రామోజీరావును ఒక  ఎన్సైక్లోపీడియాగా డీఎన్ ప్రసాద్ అభివర్ణించారు.  కష్టాలను ఎదుర్కొనే సమయంలో ఆయన చూపిన తెగింపు, తెగువ ఏ పరిస్థితులలోనూ భయపడకుండా ముందుకు సాగే నైజం నేటి యువతరానికి ఒక పాఠంగా చెప్పారు. రామోజీరావు తన జీవిత కాలంలోనే తన సమాధిని సైతం స్వయంగా డిజైన్ చేసుకున్నారని, దేవుడి కంటే తన కష్టాన్ని, నమ్మకాన్ని మాత్రమే నమ్ముకున్న మహోన్నత వ్యక్తి అని డీఎన్ ప్రసాద్ చెప్పారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, ఈనాడు పత్రికను, సంస్థలను దెబ్బతీయాలని చూసినా, ప్రజల మద్దతు,  నమ్మకమే ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టాయని స్పష్టం చేశారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుల జీవితం నుంచి నేటి యువత, వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని,  రాజకీయ ఒత్తిళ్లు, కష్టనష్టాలు ఎదురైనప్పుడు అధైర్య పడకుండా లక్ష్యం వైపు ఎలా అడుగులు వేయాలో రామోజీరావు జీవితమే నేర్పుతుందన్నారు.    


[Ramoji Rao Success Story, Margadarsi Chit Fund Legal Battles, DN Prasad, TeluguOne Journalist Episode, , Telugu Media Ramoji Rao, Telugu One]

By
en-us Political News

  
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.