గుడ్లు పొదగని మెలియా జాతి పక్షులు: జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం: పరిరక్షణ అత్యవసరం.!

Publish Date:Oct 30, 2026

Advertisement

భూమ్మీద జీవవైవిధ్యం ఎన్నో వింతలకు, అద్భుతాలకు నిలయం. మనుషుల సంచారం కంటే ముందే ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద పుట్టి పెరగడమే కాదు.. కాలగర్భంలో కలిసిపోయాయి కూడా. ఇక ఇప్పుడు మరి కొన్ని జీవరాశులు కనుమరయ్యే ముప్పు అంచున ఉన్నాయి.  అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది. అయితే ఇది గుడ్లను పొదగదు.   సూర్యరశ్మి వేడి,  భూగర్భంలోని ఉష్ణాన్ని నమ్ముకుని ఇసుక నేలల్లో గుడ్లను పాతిపెడుతుంది.  ఈ వినూత్న సంతానోత్పత్తి ప్రక్రియ పక్షి జాతిలోనే యునీక్ గా పరిశోధకులు చెబుతారు.  పుట్టిన క్షణం నుంచే  స్వశక్తితో మనుగడ కోసం పోరాటం ఈ మెలియో పక్షి ప్రత్యేకత. 

ఈ విలక్షణ పక్షి జీవన శైలే కాదు రూపం కూడా విలక్షణంగా, ఆసక్తి కగిలేలా ఉంటుంది.  సాధారణ అడవి కోడిలా కనిపించే ఈ పక్షి  ఒకటిన్నర కేజీల బరువు తూగుతుంది. ఆడ మెలియో పక్షి సాధారణంగా 1500 గ్రాముల నుంచి 1800 గ్రాముల వరకు బరువు ఉండగా, మగ పక్షి 1300 గ్రాముల నుంచి 1500 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. వీటి శరీరాన్ని నిశితంగా పరిశీలిస్తే ఎస్‌ ) ఆకారంలో ఉండే సన్నని మెడ, దానిపై చిన్న  తల, నల్లటి చిలగడ, లేత పసుపుతో పాటు నారింజ రంగు కలగలిసిన ముఖం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంగుళం పొడవుండే దృఢమైన ముక్కు పైభాగంలో నారింజ రంగు పొర, కంటి చుట్టూ లేత పసుపు వర్ణ వలయం, అలాగే  నల్లటి గుండ్రని కనుగుడ్లు ఉంటాయి. రగ్బీ బంతి ఆకారాన్ని పోలి ఉండే ఈ పక్షి శరీర పైభాగమంతా దట్టమైన నల్లని ఈకలతో కప్పబడి ఉంటుంది. తోక భాగం కూడా వంపు తిరిగి నల్లటి ఈకలతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.  ఉదరం నుంచి మోకాళ్ల పైభాగం వరకు స్వచ్ఛమైన తెలుపు ఈకలు ఉండటం దీని ప్రత్యేకత. నాలుగు బలమైన వేళ్లు కలిగి, నల్లటి కాళ్లపై పసుపు వర్ణపు పాదాలతో ఇవి స్వతంత్రంగా సంచరిస్తుంటాయి.

సంతానోత్పత్తి విషయానికి వస్తే మెలియో పక్షుల పద్ధతి సర్వసాధారణ పక్షులకు   భిన్నంగా సాగుతుంది. ఈ జాతి పక్షులు జీవితంలో ఒకే భాగస్వామితో జతకడతాయి. వయస్సు పెరిగే కొద్దీ, అంటే సాధారణంగా 24 నుంచి 36 నెలల మధ్య వయస్సులో ఇవి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో లభించే పోషకాహారం ఆధారంగా ఇవి 36 నుంచి 60 నెలల మధ్య కూడా గుడ్లు పెట్టే దశకు చేరుకుంటాయి. ఏడాదికి సుమారు 8 నుంచి 12 గుడ్లు పెట్టే ఈ పక్షులు, వాటిని భద్రపరిచే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి చాలా శ్రమిస్తాయి. మగ, ఆడ పక్షులు కలిసి సూర్యరశ్మి లేదా భూగర్భ వేడి నేరుగా తగిలే ఇసుక నేలను ఎంచుకుని బలమైన కాళ్లతో గుంటలు తవ్వుతాయి. గుడ్డు పెట్టిన తర్వాత దానిపై ఇసుకను కప్పడంలో మగ పక్షి  ఆడపక్షికి  సహకరిస్తుంది. అయితే, ఇక్కడ గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుడ్డు పెట్టిన ఇవి వాటిని పొదగవు.  ప్రకృతి సిద్ధంగా లభించే సూర్య తాపం,    భూగర్భ వేడి మాత్రమే ఆ గుడ్డును పొదిగి పిల్ల బయటకు రావడానికి సహకరిస్తుంది.

జీవశాస్త్రపరంగా ఈ పక్షుల గుడ్లు,  పొదిగే కాలం చాలా దీర్ఘమైనవిగా ఉంటాయి. మెలియో  గుడ్డు సాధారణ కోడిగుడ్డు పరిమాణంతో పోలిస్తే సుమారు నాలుగు నుంచి ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. సాధారణంగా ఈ పక్షుల గుడ్డు సగటు బరువు 232 గ్రాముల వరకు ఉంటుంది. ప్రాంతీయ పరిస్థితులు,  వాతావరణాన్ని బట్టి ఇవి 240 నుంచి 270 గ్రాముల వరకు ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వన్యప్రాణి పరిశోధనల్లో నమోదైన సగటు గుడ్డు బరువు 208 గ్రాముల వరకు ఉంటుందని స్పష్టమైంది. రెండు గుడ్ల మధ్య సుమారు 7 నుంచి 9 రోజుల వ్యవధి ఉంటుంది. భూమిలోపల ఇసుక ఉష్ణోగ్రత ద్వారా గుడ్డు పొదిగేందుకు దాదాపు 60 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఇసుకను చీల్చుకుని బయటకు వచ్చే పక్షిపిల్ల, ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణం కూడా వృథా చేయకుండా తన మనుగడ కోసం జీవనపోరాటం ఆరంభిస్తుంది.  పుట్టిన క్షణం నుంచే తల్లిదండ్రుల సహాయం కోరకుండా ఆహారం వెతుక్కోవడం, శత్రువుల నుంచి రక్షించుకోవడం దీని ప్రత్యేకత.

అయితే, ఇంతటి అద్భుతమైన జీవనశైలి కలిగిన మెలియో పక్షులు ప్రస్తుతం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇండోనేషియాలోని సులవేసి ద్వీప అడవులు వేగంగా కనుమరుగవుతుండటం, పట్టణీకరణ పెరగడం వల్ల వీటి సహజ నివాస ప్రాంతాలు నాశనమవుతున్నాయి. మరోవైపు   పాములు, ఉడుములు ఇసుకలో పాతిపెట్టిన ఈ భారీ గుడ్లను సులభంగా గుర్తించి తినేస్తుండటంతో సంతతి గణనీయంగా క్షీణిస్తోంది. దీనికి తోడు మానవ తప్పిదాలు, అక్రమ వేట, గుడ్లను ఆహారం కోసం సేకరించడం వంటి చర్యలు మెలియో   జాతి   పక్షుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పరిశోధనల ప్రకారం, ఈ పక్షులలో సరైన పోషకాహార లోపం వల్ల లేదా వాతావరణ మార్పుల కారణంగా   ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

పరాన్నజీవుల వల్ల సోకే కోక్సిడియా వంటి వ్యాధులు కూడా మెలియో పక్షులకు ప్రమాదకరంగా మారుతుంటాయి. కలుషితమైన నేల, నీరు లేదా ఆహారం ద్వారా ప్రవేశించే ఈ పరాన్నజీవుల వల్ల పక్షులకు తీవ్రమైన విరేచనాలు కావడం, ఆకలి పూర్తిగా మందగించి నీరసించిపోవడం జరుగుతుంది. ఫలితంగా అవి క్రమంగా బరువు కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాయి. అలాగే బ్యాక్టీరియా, వైరస్ లేదా శిలీంద్రాల కారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.  

ఈ అరుదైన జీవజాతిని కాపాడుకోవడానికి పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు అత్యవసర పరిరక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సులవేసి ద్వీపంలోని అడవులను, ఇసుక తీర ప్రాంతాలను సంరక్షిత ప్రాంతాలుగా ప్రకటించి, అక్రమ వేటను పూర్తిగా నిరోధించాలి. స్థానిక ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు జీవవైవిధ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ద్వారా మెలియో పక్షుల సంతతిని కాపాడవచ్చు. గుడ్ల అక్రమ సేకరణను కఠినంగా శిక్షించే నిబంధనలను అమలు చేయాలి. పక్షులకు అవసరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని, సరైన మేపు యాజమాన్యాన్ని అందిస్తూ ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం మేలు చేస్తుంది. 


[Maleo bird, Sulawesi island, Indonesia, wildfowl, Megapodiidae birds, wildlife conservation, Telugu One]

 

By
en-us Political News

  
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.