కొణిదెల కుటుంబమే నా గుర్తింపు, ఉనికి.. పవన్ సతీమణి ఎమోషనల్ పోస్ట్.!
Publish Date:Jul 28, 2026
Advertisement
పవన్ కల్యాణ్ సతీమణి అన్నాకొణిదెల సామాజిక మాధ్యమ వేదికగా చేసిన భావోద్వేగ పూరిత పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఆమె తన ఉనికి, గుర్తింపు కొణిదెల కుటుంబమేనని విస్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది తనను తన పాత పేరు అన్నా లెజినోవా అనే అంటున్నారనీ, తనను అన్నా కొణిదెల అనే సంబోధించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అన్నా కొణిదెల తన పుట్టినరోజుకు ముందు ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆ తన పెళ్లి సమయంలో వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే చివరిసారిగా 'లెజినోవా' అనే పేరు నమోదైందన్నారు. తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెల'గా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఆమె తన భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన పాత ఫొటోను జత చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు తాముద్దరం కలిసి వెళ్లిన మొట్టమొదటి విహారయాత్రకు సంబంధించిన ఫోటోగా దానికి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ పోస్ట్‌కు గంటల వ్యవధిలోనూ 69 వేలకు పైగా లైకులు వచ్చాయి. Anna Konidela, Pawan Kalyan wife, Anna Lezhneva, Anna Konidela Instagram post, Pawan Kalyan latest news, Jana Sena Party
http://www.teluguone.com/news/content/anna-konidela-36-227300.html





