తుక్కుగూడ నర్సు అత్యాచారం హత్యపై NCW సుమోటో విచారణ..!
Publish Date:Sep 2, 2026
Advertisement
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఘటనపై తెలంగాణ డీజీపీకి NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. కేసులో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన పూర్తి పరిణామాలను వెలుగులోకి తీసుకురావాలని NCW సూచించింది. నర్సు హత్యకు దారితీసిన కారణాలు, నిందితుడి పూర్వ నేరచరిత్ర తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య, క్రిమినల్ ట్రెస్‌పాస్‌కు సంబంధించిన BNS సెక్షన్లను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. కేసులో వైద్య నివేదికలు, పోస్టుమార్టం వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను భద్రపరిచి సమగ్రంగా పరిశీలించాలని NCW ఆదేశించింది. కాల్ డేటా రికార్డులు (CDR) సహా అందుబాటులో ఉన్న ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తులో భాగం చేయాలని సూచించింది. బాధితురాలి కుటుంబానికి తగిన రక్షణ, భద్రత కల్పించడంతో పాటు అవసరమైన న్యాయ సహాయం అందించాలని NCW ఆదేశించింది. కుటుంబానికి వర్తించే చట్టబద్ధ పరిహారాన్ని కూడా ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్న గడువు, దర్యాప్తుపై చేపడుతున్న పర్యవేక్షణ చర్యల వివరాలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను ఏడు రోజుల్లో సమర్పించాలని తెలంగాణ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ కోరింది. పనిచేసే మహిళల భద్రత, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని NCW స్పష్టం చేసింది. మహిళలపై నేరాల విషయంలో దర్యాప్తును వేగవంతం చేసి, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది (Thukkuguda nurse rape and murder case, NCW Chairperson Vijaya Rahatkar, CDR, Frame Care Hospital, Telangana DGP, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu news)
http://www.teluguone.com/news/content/(thukkuguda-nurse-rape-and-murder-case-24-230548.html





