కేబీఆర్‌ పార్క్‌ వన్‌వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీపీ సజ్జనార్..!

Publish Date:Sep 2, 2026

Advertisement

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగస్టు 18న నూతన ట్రాఫిక్‌ విధానం ప్రారంభమై 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఇప్పటివరకు ఎదురైన సమస్యలు, వాహనదారుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని అధికారులు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్టు కాలనీ, రోడ్‌ నంబర్‌ 45, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ పరిస్థితులను అధికారులు ఉనిశితంగా పరిశీలించారు. వాహనాల రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై అధికారులతో చర్చించారు.

వాహనాల వేగం మందగిస్తున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లో రహదారులను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. రహదారుల విస్తరణతో ట్రాఫిక్‌ అంతరాయాలను గణనీయంగా తగ్గించి, వాహనాల రాకపోకలను నిరంతరాయంగా కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ ఒత్తిడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.ముఖ్యంగా ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నంబర్‌ 45 జంక్షన్‌ మధ్య ట్రాఫిక్‌ రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ప్రాధాన్యతా క్రమంలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. 

రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, నీటి సరఫరా పైపులైన్లు, డ్రైనేజీ తదితర యుటిలిటీ లైన్లను యుద్ధప్రాతిపదికన ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టం చేశారు.హైదరాబాద్‌ నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపడుతున్న ‘హెచ్‌-సిటీ’ ప్రాజెక్టు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నూతన ట్రాఫిక్‌ విధానానికి నగరవాసులు, వాహనదారులు బాధ్యతా యుతంగా సహకరిస్తున్నా రని పేర్కొంటూ సీపీ వీసీ సజ్జనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ నగర ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
 


(KBR Park one-way traffic, CP Sajjanar, GHMC Commissioner RV Karnan, Filmnagar, Journalist Colony, Road No. 45, Jubilee Hills Checkpost, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu news, 
H-City project) 
 

By
en-us Political News

  
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.