Karthika Deepam2 : శౌర్య నా కూతురే.. కార్తిక్ ని దీప యాక్సెప్ట్ చేయగలదా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -88 లో..... శౌర్యని చూడడానికి కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. కార్తీక్ నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు.. నువ్వు ఇక్కడే ఉండు.. బూచోడు వస్తాడని శౌర్య భయపడుతుంది. ఎక్కడికి వెళ్ళను నువ్వు పడుకోమని కార్తీక్ చెప్తాడు. బూచోడు అంటే నర్సింహా వచ్చాడా అని దీపని కార్తిక్ అడుగుతాడు. అవును పాపని ఎత్తుకొని వెళ్తుంటే అడ్డుపడ్డాను.. సడన్ గా శౌర్య వాడిని చూసేసరికి భయపడిందని దీప చెప్తుంది. పాప జోలికి వాడు ఎందుకు వస్తున్నాడని కార్తీక్ అడుగుతాడు. దీప సమాధానం చెప్పదు.

మరొకవైపు అసలు తన భర్త వచ్చి నా కూతురిని నాకు ఇవ్వమని అన్న ఇవ్వట్లేదు.. అసలేం జరుగుతుంది.. ఇప్పుడు హాస్పిటల్ కి మా బావ కూడా వచ్చి ఉంటాడని కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత దీప శౌర్యకి బ్రెడ్ తీసుకొని రావడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే నర్సింహా వచ్చి అదేంటే తల్లి తండ్రి కాకుండా కార్తీక్ అని కలవరిస్తుంది.. అంత మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నామని నర్సింహా అంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ మర్యాద గా వెళ్ళమని నర్సింహాతో దీప అంటుంది. ఏంటి ఇంత పెద్దగా దీప అరుస్తుందంటూ కార్తీక్ బయటకు వస్తాడు. నా పాపని నేను తీసుకొని వెళ్తానంటూ నర్సింహా అంటుంటే.. అప్పుడే కార్తీక్ వచ్చి ఎక్కడికి తీసుకొని వెళ్తావ్ రా అని అడుగుతాడు. నీకు అసలు మ్యాటర్ తెలియదు కదా అంటూ.. అసలు విషయం కార్తీక్ కి చెప్తాడు నరసింహా. శౌర్య నాకు పుట్టినబిడ్డ అయితే నాకు ఇవ్వమంటున్నా.. నాకు పుట్టలేదంటే ఇక తన జోలికి వెళ్ళనని నర్సింహా అంటాడు. దీప ఇన్ని రోజులు బాధపడేది ఇందుకేనా అని కార్తీక్ అనుకుంటాడు. చెప్పు దీప.. నీ సమాధానం ఏంటి? మౌనం అంగీకారం అంటే నా కూతురే నేను తీసుకొని వెళ్తానని నర్సింహా వెళ్తుంటాడు. కార్తీక్ ఆపుతాడు. అయిన నర్సింహా వినడు. శౌర్య నా కూతురు.. నా కూతురని నర్సింహా అంటుంటే.. లేదు శౌర్య నా కూతురు.. నేనే తన తండ్రి అనగానే దీప షాక్ అవుతుంది. అందుకేనా ఇన్ని రోజులు చెప్పలేదని నర్సింహా అనుకొని.. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదంటూ నరసింహా వెళ్ళిపోతాడు. మరొకవైపు జ్యోత్స్న హాస్పిటల్ కి వచ్చి.. కార్తీక్ అన్న మాటలు విని షాకై వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఎందుకు ఇలా అన్నారు అని అంటుండగా.. అప్పుడు శౌర్యా వస్తుంది. మరొకవైపు ఎందుకిలా చేసావ్ బావ అంటూ పట్టరాని కోపంతో జ్యోత్స్న ఉంటుంది. ఆ తర్వాత శౌర్యకి బ్రెడ్ తినిపించి దీప కార్తీక్ దగ్గరికి కోపంగా వస్తుంది. నువ్వు శౌర్యకి తండ్రివా.. అంటూ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.